నిన్నటి ఎన్నికల ఫలితాల షాక్ నుండి తెలుగుదేశం వర్గాలు ఇంకా తెరుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ‘లెజెండ్’ సినిమాతో తిరిగి టాప్ హీరోల రేసులోకి వచ్చిన బాలకృష్ణ నిన్నటి జగన్ ఫ్యాన్ సునామీని తట్టుకుని సుమారు 20వేల ఓట్ల మెజారిటీ రావడంతో బాలయ్య అభిమానులు జోష్ లో ఉన్నారు. 

అంతేకాదు రాబోతున్న కాలంలో తెలుగుదేశం పార్టీకి జీవం పోయగల శక్తి తమ హీరోకే ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ కూడ పెడుతున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ వ్యక్తులలో పవన్ ఓడిపోతే బాలకృష్ణ గెలవడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించే వార్తగా మారింది. 

వాస్తవానికి నిన్న వీచిన రాజకీయ ఉప్పెనలో చంద్రబాబునాయుడు క్యాబినెట్ లోని 17 మంది మంత్రులు పరాజయం చెందితే ఇంత భారీ మెజారిటీతో బాలకృష్ణ గెలవడం ఒక విధంగా తెలుగుదేశం వర్గాలకే షాకింగ్ న్యూస్ గా మారింది అని టాక్. దీనికితోడు ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలలో బాలకృష్ణ గెలుపు కష్టం అన్న సంకేతాలు మీడియాలో కూడ వచ్చాయి. 

దీనికితోడు బాలకృష్ణ తరుచూ తన అభిమానులతో అసహనాన్ని చూపించిన వీడియోలు కూడ హడావిడి చేసాయి. అయితే ఈవిషయాలు ఏమీ పట్టించుకోకుండా బాలయ్యకు హిందూపురం ఓటర్లు పట్టం కట్టడంతో ఒక విధంగా తెలుగుదేశం పార్టీలో నందమూరి హవాకు ఇంకా ఆస్కారం ఉంది అన్న సంకేతాలు ఇస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్ అయినా ఎన్నికలలో ఊహించని విజయం బాలయ్యకు లభించడం ఒక విధంగా రియల్ ‘లెజెండ్’ అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: