Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 9:08 pm IST

Menu &Sections

Search

మెగాస్టార్ బాటలోనే పవర్ స్టార్ కూడానా...??

మెగాస్టార్ బాటలోనే పవర్ స్టార్ కూడానా...??
మెగాస్టార్ బాటలోనే పవర్ స్టార్ కూడానా...??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సీనియర్ నటులు ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు తరువాత తిరుగులేని హీరోగా కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ని ఏలిన మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఎందుకంటే, అయన సినిమాలు సాధించే బాక్సాఫీస్ కలెక్షన్లే అందుకు నిదర్శనం. అయితే దాదాపు ఇరవైఏళ్ళు  పైబడిన తన సుదీర్ఘ సినిమా ప్రయాణం తరువాత 2009లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ని స్థాపించి రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. అయితే పార్టీ పెట్టినప్పటినుండి మెగాస్టార్ కు మరియు ఆయన పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన లభించింది అనే చెప్పాలి. అయితే ఏమి జరిగిందో తెలియదుగాని అయన తన ఫ్యాన్ బేస్ ని ఓట్లుగా మార్చుకోవడంలో సఫలం కాలేక అప్పటి ఎలక్షన్లలో కేవలం 18 సీట్లు మాత్రమే పొందగలిగారు. అనంతరం ఎక్కువకాలం తమ పార్టీని నడపలేక ఆపై కొన్నాళ్ళకు కాంగ్రెస్ లో తమ పార్టీని ఆయన విలీనం చేయడం జరిగింది. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ తరపున కొన్నాళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. 

ఇక ఆ తరువాత రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని మెగాస్టార్, ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్ళి సినిమాల్లోకి రిఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తరువాత 2014లో అయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒంటరిగా జనసేన పార్టీని నెలకొల్పడం జరిగింది. నిజానికి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పిన సమయంలో పవన్ యువరాజ్యం విభాగానికి అధిపతిగా పనిచేయడం జరిగింది. ఇక తన జనసేన పార్టీ నెలకొల్పిన తరువాత అప్పటి ఎన్నికల్లో టిడిపికి పవన్ మద్దతు ఇచ్చారు, అయితే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి మాత్రం దిగలేదు. అయితే అయన మద్దతిచ్చిన టీడీపీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటి 2019 ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీ తో పొత్తు పెట్టుకున్న పవన్, డైరెక్ట్ గా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన పార్టీ నుండి కేవలం ఒకే ఒక అభ్యర్థి గెలవడం, అలానే పవన్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 

ఇక పవన్ మాత్రం ఈ ఓటమి వలన ఏ మాత్రం తాము కృంగిపోవడం లేదని, రాబోయే రోజుల్లో ప్రజల తరపున వారి సమస్యలపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు. కానీ పవన్ చెపుతున్న దానిని బట్టి కొందరు విశ్లేషకులు చెపుతున్న మాట ఏంటంటే, అన్నయ్య చిరంజీవి మాదిరి పవన్ తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేయనప్పటికీ, పూర్తి స్థాయి రాజకీయాల్లో మాత్రం కొనసాగే అవకాశం కనపడడం లేదని, అయితే ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తారని అంటున్నారు. ఎందుకంటే మళ్ళి ఐదేళ్లకుగాని ఎన్నికలు రావు, అలానే ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ, మరోవైపు అభిమానుల కోసం సినిమాలు చేయడం తప్పులేదనేది వారు చెపుతున్న వాదన. నిజానికి ఇది తప్పేమి కాదని, అన్నయ్య చిరంజీవి మాదిరి పవన్ సినిమాలు కూడా తప్పకుండా చేస్తారని చెపుతున్నారు. అయితే వారు చెపుతున్న ప్రకారం ప్రస్తుతం ప్రచారవుతున్న ఈ వార్త నిజామా, కాదా అనేది తెలియాలంటే మాత్రం పవన్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే....!! 


megastar-powerstar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
11 గంటల సర్జరీ, 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తప్పదట...!!
'సాహో' తో అతడికి మరొక ఛాన్స్ ఇచ్చారట....!!
శేఖర్ కమ్ముల మరొక 'ఫిదా' కు అంతా సిద్ధం....!!
బ్రేకింగ్ :  డైరెక్టర్ మణిరత్నం కు గుండెపోటు....!!
సీఎం జగన్ పాలన నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఎంతవరకు ప్లస్ అవుతుంది...??
ఈసారి విశాల్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి....!!
'సాహో' తో మాకు పోటీ లేదంటున్నారు....!!
దేవిశ్రీ ప్రసాద్ హ్యాట్రిక్ కొడతాడా...??
'బాహుబలి'ని దాటేయడం ఖాయమంటున్నారు....!!
సుకుమార్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి....!!
ఫారెన్ నుండి తిరిగొచ్చిన సూపర్ స్టార్....ఇక షూటింగ్ షురూ...!!
అతడు, అత్తారింటికి దారేదిని కలిపి తీసినట్లు ఉంటుందట....!!
ఈ సీక్వెల్ తో హిట్ కొడతాడా....!!
బిగ్ బాస్ - 3 తెలుగు ప్రోమో విడుదల....!!
ప్రభాస్ తరువాత ఇక మహేష్ బాబే టార్గెట్ అట...!!
అక్కడ 'సాహో' ని మించిపోయిన 'ఆర్ఆర్ఆర్'...!!
మెగాస్టార్, కొరటాల సినిమాకు నిర్మాతలు వీళ్ళే.....!!
'సాహో' స్క్రీన్ ప్లే అదిరిపోతుంది అంటున్నాడు.....!!
'సాహో' కి అదొక్కటే పెద్ద మైనస్ కానుందా....??
విశాల్ పై విరుచుకుపడిన స్నేహితురాలు వరలక్ష్మి....!!
సూపర్ స్టార్ సినిమా కోసం ఆ సినిమా వదిలేసుకుందా....??
'సరిలేరు నీకెవ్వరు 'తో అన్ని లెక్కలు సరిచేస్తాడట....!!
సైరా సినిమా, ట్రైలర్ విడుదల తేదీ ఖరారు...??
'సాహో' కు అతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలంటున్నారు....!!
టీజర్ లో హీరోయిన్ లేకపోవడం పై క్లారిటీ ఇచ్చాడు...!!
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, మరి పాటల పరిస్థితి ఏంటి....!
రాజమౌళి స్థాయిని అతడు అందుకోగలడా....??
నాగార్జునకు మహేష్ బాబు హిట్ ఇస్తాడా.....??
ప్రేమలో పడను, ప్రేమను సృష్టిస్తాను అంటున్న మన్మధుడు....!!
అదరహో అనిపించిన ప్రభాస్ 'సాహో' టీజర్...!!
'మహర్షి' మేనియా అక్కడ ఇంకా తగ్గలేదు....!!
 మహేష్ బాబు బాటలోనే త్రివిక్రమ్ కూడా ...??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.