అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అంతేకాదు అమ్మాయిల్లోనూ ఓ రేంజ్ క్రేజ్ ను  దక్కించుకున్నాడు. వరుస సినిమాలతో బిజి బిజీగా ఉన్నాడు. డియర్ కామ్రేడ్ త్వరలో రిలీజ్ కు సిద్దమవుతుండగా హీరో, బ్రేకప్ అనే మరో రెండు సినిమాలను లైన్‌లో పట్టాడు.


ఇక డాక్టర్ రాజశేఖర్ పీ.ఎస్.వి గరుడ వేగ తో మళ్ళీ ఫాం లోకి వచ్చిన కల్కీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మళ్ళీ రాజశేఖర్ మరో భారీ హిట్ కొట్టడానికి రడీ అవుతున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఫిక్సై పోయారు. ఇలా విజయ్ దేవరకొండ , రాజశేఖర్ ఎవరికి వారు తమ సినిమాలలో బిజీ బిజీ గా ఉంటూనే వాళ్ళ వారసులను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ హీరోగా, రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.  దొరసాని టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాను తెలంగాణ నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌స్టోరిగా కేవీఆర్‌ మహేంద్ర తెరకెక్కించాడు. పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: