హీరోయిన్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక కరెక్ట్ గా రెండు హిట్లు పడితే చాలు ఇక ఆ హీరోయిన్ కి అవకాశాలు ఏ రేంజ్ లో వస్తాయో సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, తమన్నా.. లాంటి వాళ్ళను చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే జోరును రష్మిక మందన్న కొనసాగిస్తోంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది.  అవకాశాల పరంగా చూసుకుంటే రష్మికు ఎండాకాలం ఆఫర్ల వాన కురుస్తోంది. ఇప్పటికే చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్న రష్మికకు తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చిందని సమాచారం. 

తమిళంలో ఇప్పటికే కార్తి  తాజా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక.  ఈ సినిమాతోనే రష్మిక కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే విజయ్ లాంటి స్టార్ హీరోతో సినిమా అవకాశం దక్కించుంది. ఇక తెలుగులో అసలు రష్మిక జోరు టాప్ గేర్ లో ఉంది.  విజయ్ దేవరకొండ సినిమా 'డియర్ కామ్రేడ్' లో రష్మికనే హీరోయిన్.  నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భీష్మ' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా మహేష్ బాబు - అనిల్ రావిపూడి సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా ఎంపికయింది.  అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పట్టాలెక్కనున్న సినిమాలో కూడా రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారని లేటెస్ట్ న్యూస్.


ఇక కన్నడలో కూడా రష్మికకు క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చేతిలో ఉన్న ఆఫర్లు కాకుండా ఇంకా చాలా ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయని సమాచారం.  ఒక భాషలో బిజీగా ఉండడం సరే కానీ ఇలా తెలుగు.. తమిళం.. కన్నడ ఇలా మూడు భాషల్లో క్రేజీ హీరోయిన్ గా క్రేజీ ఆఫర్లు రావడం మామూలు విషయం కాదు. ఇదే విషయం గురించి రష్మిక ఏం చేయను ఇన్ని సినిమాలు ఒకేసారి చేయడం..ఇంత స్ట్రెస్ తట్టుక్కోవడం నా వల్ల కావడం లేదు. కానీ ఈ అదృష్ఠం అందరికీ దక్కదు కదా అంటోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: