వాణీ కపూర్...ముంబై లో టాప్ మోడల్. పెద్ద పెద్ద కార్పొరెట్ కాంటాక్ట్స్ తో ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే వాణీ కపూర్ పేరుకి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడూ హాట్ హాట్ ఇమేజస్ తో ప్రేక్షకులను అందుబాటులోనే ఉంటుంది. ఆహా  కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో మళ్ళీ టాలీవుడ్ లో కనిపించలేదు. అంతేకాదు యష్ రాజ్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ తనకి సపోర్ట్ గా ఉన్నప్పటికి దురదృష్టం మాత్రం వెనకాలే వస్తోంది. 


అందుకే చాలా కాలంగా మోడలింగ్‌కే పర్మినెంట్ అయిపోయింది. అయితే అందం, అభినయం ఉన్న ఏ గ్లామర్ హీరోయిన్‌కైనా ఒక గొప్ప అవకాశం తలుపు తడుతుంది. అలానే వాణీ కి ఇప్పుడు ఓ అవకాశం వచ్చింది. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ సంషేరాలో అవకాశం అందుకుంది. ప్రస్తుతం  సెట్స్ పై ఉన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ - సంజయ్ దత్ హీరోస్ గా నటిస్తున్నారు. కరణ్ మల్హోత్రా ఈ సినిమాకి దర్శకుడు. 1800 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఓ గిరిజన ఉద్యమకారుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 
అంతేకాదు ఈ సినిమాలో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తుండడం మరో ఆసక్తికరమైన అంశం.

ఇక వాణీ ఈ సినిమాలో  డ్యాన్సర్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న సినిమాలోనూ వాణీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబైలో బెస్ట్ మోడల్స్ జాబితాని తిరగేస్తే వాణీ పేరు ఆ జాబితాలో ఉంటుందనడంలో సందేహమేం లేదు. అయితే సినిమాల పరంగా ఇన్నాళ్లు కాలం కలిసి రాలేదంతే. ఇకనైనా వాణి నటిస్తున్న రెండు సినిమాలతో రీలాంచ్ తో కం బ్యాక్ హీరోయిన్ అనిపించుకుంటుందో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: