ఒక రైతు కూతురు అంచెలంచెలుగా దేశవాళీ క్రికెట్ ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాణించి మరో మిథాలీ రాజ్ అని నిరూపించుకుంటే ఎలా ఉంటుంది? ఒక పల్లెటూరి అమ్మాయి.. స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుంటే.. ప్రపంచం మొత్తం తన ట్యాలెంట్ ని చూసి మెచ్చుకుంటే ఆ కిక్కు ఎలా ఉంటుంది?..కథాంశంతో  తెరకెక్కుతున్న సినిమా 'కౌశల్య కృష్ణమూర్తి'.  క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'కాన' సినిమాని  తెలుగులో రీమేక్ చేస్తున్నారు.


తమిళ సినిమాలో  నటించిన ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషిస్తోంది. 50 ఏళ్ల కెరీర్ లో 47 పైగా సినిమాలు నిర్మించిన కె.ఎస్.రామారావు స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో రూపొందించే సినిమాలంటే ఎంతో ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఇంతకముందు శర్వానంద్ - నిత్యామీనన్ జంటగా 'మళ్లి మళ్లి ఇది రాని రోజు సినిమాను అథ్లెట్ కథాంశంతో నిర్మించారు. ఈ సినిమాకి ఫిలింఫేర్ బెస్ట్ క్రిటిక్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే.


ఎన్నో రీమేక్ సినిమాలని తెరకెక్కించిన భీమనేని శ్రీనివాస్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.  ఐశ్వర్యా రాజేష్ టైటిల్ పాత్రలో చక్కగా నటించింది. నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ మరో సారి ఎంతో గొప్ప పాత్ర పోషించారని చిత్ర దర్శకులు అన్నారు. ఇక ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి  జులై  మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: