మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఏ వేడుక లో నైనా ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ముఖ్యంగా బన్నీ కి ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారని టాక్ కూడా. అంతేకాకుండా షూటింగ్ సమయంలో తాను పనిచేస్తున్న ప్రాంతంలో సెట్స్ లో అందరితో కలిసి పోతూ సరదాగా కూడా అల్లు అర్జున్ గడుపుతారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల అల్లు అర్జున్ ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు.

Allu Arjun attends asst choreographer's wedding

ఆ వివాహం బంధువులతో, స్టార్ సెలబ్రిటీలదో కాదు. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వివాహ వేడుక అది. అసిఓస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీష్ వివాహం హైదరాబాద్ లో నేడు జరిగింది.ఈ వివాహ వేడుకకు బన్నీ హాజరై వధూవరులని ఆశీర్వదించాడు. శిరీష్ తన కెరీర్ ని గీత ఆర్ట్స్ సంస్థలోనే ప్రారంభించాడు. శిరీష్ లోని డాన్స్ ప్రతిభని గమనించిన బన్నీ స్వయంగా అతడికి ట్రైనింగ్ ఇప్పించాడు. దీనితో శిరీష్ ప్రస్తుతం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. శిరీష్ వివాహ వేడుకలో బన్నీ సందడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Related image

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరోపక్క సుకుమార్ తో కూడా సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట బన్నీ. అయితే తాజాగా ఈ వివాహ వేడుకకు బన్ని వెళ్లడంతో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది బన్నీ ది చాలా పెద్ద వెన్నలాంటి మనసు అన్ని కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: