టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ కోసం చాలామంది నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో సినిమాలు నిర్మిస్తుంటారు. ఏ మాత్రం ఈ సీజన్లో సినిమా హిట్ పడిందంటే సదరు సినిమా నిర్మాత దశా దిశా మారిపోయినట్లే. అంతగా లాభాలు తెచ్చి పెడుతుంది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలకు. అయితే తాజాగా రాబోతున్న 2020 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని నాలుగు సినిమాలు రెడీ అవగానే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టు కూడా ఈ లిస్టులో జాయిన్ అయింది.


వివరాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిలిమ్‌ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు టాక్.


ఇప్పటికే నందమూరి బాలకృష్ణ – కె.ఎస్.రవికుమార్ చిత్రం, సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కనున్న సినిమా, మెగాహీరో సాయితేజ్ – మారుతి కాంబినేషన్‌లో రూపొందనున్న మూవీ, సూపర్ స్టార్ రజినీకాంత్ – పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ‘దర్బార్’… పొంగల్‌ని టార్గెట్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో… ఐదో చిత్రంగా బన్నీ, త్రివిక్రమ్ మూవీ కూడా రానుండడం ఆసక్తిని రేకెత్తించేదే.మ‌రి… చివ‌రాఖ‌రికి ఈ 5 చిత్రాల్లో ఏవి సంక్రాంతికి సంద‌డి చేస్తాయో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: