ఎన్ని చెప్పుకున్న మరెన్ని అనుకున్నా నిజాలు  ఎపుడు కఠోరంగానే ఉంటాయి ఆ వాస్తవాలను  డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఇపుడు టాలీవుడ్ అదే పరిస్థితిలో ఉందా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఏపీలో మారిన రాజకీయంపై టాలీవుడ్లో సైలెంట్ ఏం చెబుతోంది.


జగన్ ఏపీ సీఎం అవుతున్నారు. ఆయన బాధ్యతలు కొద్ది రోజుల్లో స్వీకరిస్తారు. జగన్ కి టాలీవుడ్ నుంచి అభినందనలు ఈ సమయంలో పెద్దగా రాకపోవడం చర్చనీయాంశంగా ఉంది. మోహన్ బాబు ఫ్యామిలీ అయితే వైసీపీతోనే ఊంది కాబట్టి వారంతా కంగ్రాట్స్ చెప్పారు. ఇక యంగ్ హీరో రాం పోతినేని తొలి రోజునే అభినందనలు చెబితే సూపర్ స్టార్ మహేష్ బాబు మరుసటి రోజు స్పందించి జగన్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. 


ఇక అక్కినేని నాగార్జున ఎటూ జగన్ దోస్త్ కాబట్టి ఆయన కూడా గ్రీట్ చేశారు. మరి టాలీవుడ్ అంటే ఇంతేనే.. బోలెడు పెద్ద తలకాయలు ఉన్నాయిగా. వారెందుకు రెస్పాండ్ అవడంలేదు. మెగా ఫ్యామిలీ నుంచి పవన్ పార్టీ పెట్టారు. ఓడారు. అందువల్ల మొహమాటలు ఏమైనా ఉన్నాయేమోనని వినిపిస్తోంది. ఇక మరికొందరి వేరే బంధాలు కారణంగా ఓపేన్ గా చెప్పలేకపోతున్నారని అంటున్నారు. 
ఎందరో నిర్మాతలు, పెద్ద దర్శకులు, టాప్ స్టార్స్ ఉన్న టాలీవుడ్లో జగన్ కి కొంతమందే విషెస్ చెప్పడం చూస్తే ఏపీ రాజకీయం టాలీవుడ్ ని కూడా విడదీసిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: