బాలీవుడ్ నటుడు దర్శకుడు నిర్మాత కమల్ ఖాన్ కు దక్షిణాది సినిమా రంగం అంటే విపరీతమిన ద్వేషం. ఆ ద్వేషంతో అతడు తరుచూ దక్షిణాది భాషలకు సంబంధించిన సినిమాల పై ఆసినిమాలలో నటించిన హీరోల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. 

గతంలో ‘బాహుబలి’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాల పై కమల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. అయితే ఇప్పుడు ఇతడి దృష్టి ప్రభాస్ ‘సాహో’ పై పడింది. ఆగష్టు 15న విడుదల కాబోతున్న ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు బాలీవుడ్ లో కూడ ఉన్నాయి. 

అయితే ఈసినిమా ఫ్లాప్ గా మారడమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో స్థానం సంపాధించుకునే టాప్ ఫ్లాప్ మూవీస్ లిస్టులో ‘సాహో’ చేరడం ఖాయం అంటూ ఇతడు చేసిన కామెంట్స్ పై ప్రభాస్ అభిమానులు విపరీతంగా మండి పడుతున్నారు. ‘బాహుబలి’ రేంజ్ లో విడుదల కాబోతున్న ఈమూవీ పై కమల్ ఖాన్ చేసిన కామెంట్స్ ను బట్టి కొన్ని శక్తులు బాలీవుడ్ లో ఇప్పటి నుండే ‘సాహో’ నెగిటివ్ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి అని అనిపించడం సహజం. 

ఈమధ్య ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత భారీ అంచనాలతో విడుదలైన చాల భారీ సినిమాలు ఫ్లాప్ అయిన నేపధ్యంలో కమల్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడు అని కొందరు అంటున్నారు. అయితే ‘సాహో’ బిజినెస్ ను అత్యంత భారీ స్థాయిలో చేయాలి అని వ్యూహాలు రచిస్తున్న పరిస్థుతులలో కమల్ ఖాన్ చేసిన కామెంట్స్ ఎంతోకొంత ఈమూవీ మార్కెట్ పై ప్రభావితం చేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: