సినిమా సంగీత ప్రభంజనం దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన సినిమాలు గతంలో ఫెయిల్ అయినా ఆ సినిమాలలోని పాటలు మాత్రం హిట్ అవుతూనే వచ్చాయి. అయితే ఆతరువాత పరిస్థుతులు మారిపోయి దేవిశ్రీ అందిస్తున్న ట్యూన్స్ ఏమాత్రం క్యాచీగా లేకుండా తన పాటల ట్యూన్స్ ను తానే దేవిశ్రీ కాపీ కొడుతున్నాడా అనే స్థాయిలో విమర్శలు చెలరేగిపోయాయి.

ఈ సంవత్సరం దేవిశ్రీ ట్యూన్స్ అందించిన ‘వినయ విధేయ రామ’ ‘మహర్షి’ సినిమాలు రెండు ఆడియో పరంగా ఘోరంగా ఫెయిల్ అయిన నేపధ్యంలో దేవిశ్రీ పై చరణ్ మహేష్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాలు అన్నీ తన దృష్టి వరకు రావడంతో దేవిశ్రీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

తెలుస్తున్న సమాచారం మేరకు దేవిశ్రీ ఇకపై పెద్ద సినిమాలకి తనతో ఎక్స్‌క్లూజివ్‌గా పనిచేసే దర్శకులకి మాత్రమే మ్యూజిక్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయినట్లు టాక్. ఇందులో భాగంగానే ఇతడు ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా చాలామంది నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు దేవిశ్రీ తిరిగి ఇచ్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పని ఒత్తిడి పెరిగి పోవడంతో తాను అందించే ట్యూన్స్ విషయంలో ఏకాగ్రత తప్పుతున్నానని ఇతడు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ నిర్ణయం దేవిశ్రీ తీసుకోవడంతో తన ఇమేజ్ మరింత పడిపోకుండా తనకు తానే ఈ సంగీత యువతరంగం బ్రేక్ వేసుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దీనితో ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ ఆలోచనలు మారినట్లుగానే దేవిశ్రీప్రసాద్ ఆలోచనలు కూడ మారిపోయాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: