మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం ఎంపిగా జనసేన అభ్యర్ధిగా పోటీలో దిగారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేని పరిస్థితి. ఇక నాగబాబు కూడా ఘోర పరాజయపాలయ్యాడు. ఈ ఎలక్షన్స్ కోసం జబర్దస్త్ షోని పక్కన పెట్టిన నాగబాబు ఎంపిగా గెలిచినా ఓడినా షో కొనసాగిస్తా అన్నాడు.


కాని పరిస్థితులు చూస్తుంటే ఓటమి బాధతో నాగబాబు జబర్దస్త్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ పక్క రోజా ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి తన సత్తా చాటారు. ఎమ్మెల్యేగా ఈసారి గెలిస్తే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేస్తానని అన్నారు రోజా. కాబట్టి రోజా కూడా జబర్దస్త్ లో కొనసాగే అవకాశం కనిపించట్లేదు.


ఈమధ్య రోజా, మీనా, సంఘవి ఇలా ఎపిసోడ్ కు ఒకరు జడ్జులు సర్ ప్రైజ్ ఇస్తూ వచ్చారు. లేటెస్ట్ గా ఆలి జబర్దస్త్ జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చారు. సో నాగబాబు రోజా కాకుంటే ఆలి ఒకరు కన్ ఫాం అని చెప్పొచ్చు. ఇక మీనా, సంఘవిలలో ఎవరు ఈ షోకి రెగ్యులర్ జడ్జ్ అవుతారన్నది తెలియాల్సి ఉంది.


గెలిచి రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాలనుకుంటుంటే.. నాగబాబు ఓడిపోయారు కాబట్టి ఆ అవమాన భారంతో జబర్దస్త్ కు రావడం కష్టమని అంటున్నారు. మొత్తానికి జబర్దస్త్ కొత్త జడ్జులు వచ్చే టైం వచ్చేసింది. మీనా, సంఘవి, ఆలి ఈ ముగ్గురిలో ఎవరు ఫుల్ టైం జడ్జులుగా కొనసాగుతారు అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: