‘అంతా నాయిష్టం’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఒక వెబ్ ఛానల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు ఈ వెబ్ ఛానల్ ద్వారా అనేక నెగిటివ్ కామెంట్స్ చేసాడు. ఆతరువాత ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాగబాబు ‘జనసేన’ ను ఆకాశానికి ఎత్తేస్తూ అనేక వీడియోలు కూడ పోస్ట్ చేసాడు.

అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చి అసలు ‘జనసేన’ వచ్చే ఎన్నికల వరకు నిలబడగలుగుతుందా అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రంగంలోకి దిగిన నాగబాబు జనసేన కార్యకర్తలకు జనసేన మహిళా విభాగంలోని వీర మహిళలకు అధైర్య పడవద్దని సందేశం ఇస్తూ ఒక వీడియోను తన వెబ్ ఛానల్ లో పెట్టడమే కాకుండా రాబోతున్న రోజులు అన్నీ ‘జనసేన’ కు మంచి రోజులు అనీ మరీ బెంగగా అనిపిస్తే విహార యాత్రకు వెళ్ళిరమ్మనీ నాగబాబు ఇచ్చిన సందేశం పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. 

ఆ వీడియో చూసిన చాలామంది జనసైనికులు విహార యాత్రకు వెళ్ళి రావడానికి నాగబాబు స్పాన్సర్ చేస్తాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. అంతేకాదు చివరి నిముషంలో రాజకీయాలలోకి వచ్చి గెలవాలి అనుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. 

మరికొందరైతే నాగబాబు పై తాము వేస్తున్న జోక్స్ ను మరింత పెంచుతూ జనసైనికుల్ని ఓదార్చడం బాగానే ఉంది కానీ ఓడిపోయిన మిమ్మలను ఎవరు ఒదారుస్తారు అంటూ మరో సెటైర్ వేస్తున్నారు. ఒకవైపు క్షేత్ర స్థాయి నుండి జనసేనను బలోపేతం చేయాలి అని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉంటే నాగబాబు ఇలా అనవసరమైన సెటైర్లకు కారణం అవుతున్నాడు అంటూ మరికొందరు పవన్ అభిమానులు తల పట్టుకుంటున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: