రాం గోపాల్ వరం అనుకున్నది చేస్తాడు. మొత్తానికి ఏపీ జనాలకు తన సినిమా చూపిస్తానని అంటున్నాడు. ఎపుడో మర్చిలో వచ్చిన సినిమా ఏపీలో విడుదల కాలేదు. అపుడు రాజకీయం వేరు. పైగా తెలంగాణాలో సినిమాకు ఓకే అంటే ఏపీలో బ్రేక్ వేశారు.


ఇక ఇపుడు సీని మొత్తం మారిపోయింది.దాంతో మూవీని రిలీజ్ చేసేందుకు రాము రెడీ అంటున్నాడు. మే 31న ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఏపీ జనాలు ఆల్రెడీ పైరసీ సహా అనేక మార్గాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసేశారు. చంద్రబాబు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి.. ఆయన వ్యతిరేకులు కూడా సినిమా పట్ల అంత ఆసక్తి ప్రదర్శించకపోవచ్చు. కాకపోతే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం ద్వారా వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి తమ పంతం నెగ్గించుకోవాలని మాత్రం చూస్తున్నారు.


మరి ఈ సినిమా రిలీజ్ మాత్రం  టాలీవుడ్లో ఓ చరిత్ర. ఓ సెన్షేషన్ గానే చూడాలి. ఎందుకంటే ఇది బాబు రాజకీయాన్ని గురి పెట్టి తీసిన సినిమా. తీసిన వారు వర్మ కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: