మొన్నటి వరకు ఏపిలో ఎన్నికల సందడి ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఏపిలో మూడు ముఖ్య పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన నువ్వా అంటే నువ్వా అనే రేంజ్ లో ప్రచారం చేశాయి.  అయితే ఎవరికి వారే తాము ఎన్ని సీట్లు గెలుస్తామో ప్రిపేర్ లో ఉన్నారు.  ఆ మద్య ఎగ్జిట్ పోల్ లో టీడీపీ, జనసేన పక్కన బెట్టి వైసీపీ కే ఎక్కువ మార్కులు పడ్డాయి.  


ఇక 11న ఏపిలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి..సర్వేలకు కూడా అంతు చిక్కకుండా వైసీపీ భారీ ప్రభంజనం సృష్టించింది.  ఏకంగా 150 స్థానాలు కైవసం చేసుకొని ఇతర పార్టీల మైండ్ బ్లాక్ చేసింది.  ఇక జనసేన పార్టీ అయితే 1 సీటు తో సరిపెట్టుకుంది. కాగా, ఏపీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన నటి, బీజేపీ అభ్యర్ధి మాధవీలత ఓడిపోయారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ..తాను అనుకున్న స్థాయిలో గెలవలేకపోయానని..కానీ తన ఓటమి పెద్ద లేక్కలోకి రాలేదని అన్నారు. 

మొదటి నుండి చెప్పాను.. ఎక్కడ కూడా నేను గెలుస్తాను అనే మాట వాడలేదు. మోడీ మళ్ళీ రావాలి అనే కోరుకున్న వచ్చారు. అయితే ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకు వచ్చి..ప్రజా క్షేత్రంలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఓటమి నాకు వింతగా విడ్డురంగా ఉంది. డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాము మాకు నిజాయితీ పరులు వొద్దు అని బలే చెప్పారుగా. అంటూ జనాలపై పంచ్ వేసింది.

చదువుకున్న వారు రాజకీయంలోకి రావాలి అనేది మీరే..జేడీ లక్ష్మి నారాయణ గారు వచ్చారు? ఎందుకు ఓడించారు? విద్యార్థులు ఏమయ్యారు? మీ ఓట్లు ఏమయ్యాయి..?డబ్బు కులం కావాలి అని నిరూపించారుగా.. చదువు నీతి వొద్దు అని చెప్పేసారుగా? అంటూ యువతకు కౌంటర్ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: