2018 వరుసగా ఫ్లాప్స్ వచ్చిన, చేదు ఫలితాలను ఇచ్చినా 2019 లో జెర్సీతో వసూళ్ళ కన్నా ఎక్కువగా ప్రశంసలు దక్కించుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ లో బిజీగా ఉన్న నాని ఆగస్ట్ నెలాఖరున రానున్న ఈ సినిమాపై నాని అభిమానులతో పాటు 'గ్యాంగ్ లీడర్' టైటిల్ కారణంగా మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుదీర్ బాబు-ఆదితి రావు హైదరి జంటగా రూపొందుతున్న మూవీలో నాని ఓ స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.


'వి' టైటిల్ తో ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. నాని పాత్రకి  ఎంత లెంత్ ఉంటుంది మెయిన్ లీడ్ పెయిర్ కి అతనికి కనెక్షన్ ఏమై ఉంటుంది అనే దాని మీద నానీ ఫ్యాన్స్‌కు బోలెడన్నీ డౌట్స్ ఉన్నాయి. అందుకు కారణం ఇన్ సైడ్ టాక్ ప్రకారం నాని కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడని సమాచారం. కరెక్ట్‌గా చెప్పాలంటే జెంటిల్ మెన్ లో అర్జున్, ఠాగూర్ లో చిరంజీవి, టెంపర్ లో జూనియర్ ఎన్టీఆర్ లాగా అనమాట.


నాని పాత్రను ఇంద్రగంటి ఎంతో వెరైటీగా తీర్చిదిద్దారట. ఇక 'వి' టైటిల్ కూడా నానిని ఉద్దేశించి పెట్టినదే అని మరో లేటెస్ట్ న్యూస్ ప్రచారంలో ఉంది. ఏదైతేనేం నాని రొటీన్ రూట్ లో పడకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. జెర్సి లో ఏడిపించి గ్యాంగ్ లీడర్ లో నవ్వించబోతున్న నాని 'వి'లో ఆలోచింపజేయబోతున్నాడు. అంతేకాదు ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం.


మరింత సమాచారం తెలుసుకోండి: