టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన సునామి కలెక్షన్లు కొల్లగొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటనకు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు హీరోలు ఓ రేంజ్ లో నాని నటన పై అభినందనలు తెలిపారు. ఎన్నో ప్రయోగాత్మకంగా కథలను ఎంచుకునే నాని..ఎప్పుడూ కూడా తనలో ఉన్న నటునికి కొత్త కొత్త పరీక్షలు పెడుతూ ఉంటాడు.


ఇదిలా ఉండగా తాజాగా జెర్సీ సినిమా తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేస్తున్నసినిమా లో సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేదిత థామస్ నటిస్తున్నారు. సుధీర్ బాబు ప్రధాన పాత్ర తరహాలో నటిస్తున్న ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని భయంకరమైన విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఇదే విధంగా జెంటిల్మెన్ సినిమాలో నటించిన నాని ఆ సినిమాలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.


అయితే తాజాగా చేయబోయే సినిమాలో మాత్రం నాని ని ప్రేక్షకులు ఎవరు ఊహించని విధంగా చూపించబోతున్నారట డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. అయితే ఒక మంచి కారణం వల్ల నాని ఈ సినిమాలో ప్రతికూల పాత్రలో నటిస్తాడని..ఆ కారణాన్ని మెయిన్ లైన్ గా తీసుకునే ఈ సినిమా స్టోరీని నడిపిస్తారట డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట సినిమా యూనిట్. మొత్తంమీద చూసుకుంటే న్యాచురల్ స్టార్ నాని మరొక సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: