వరుస ఫ్లాపులు తన కెరీర్లో పలకరిస్తున్న సమయంలో టెంపర్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన హిట్టు కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచిపోయింది అప్పట్లో. అయితే తాజాగా ఈ సినిమాను కోలీవుడ్ ఇండస్ట్రీ హీరో విశాల్ అయోగ్య పేరిట తమిళంలో రీమేక్ చేశారు.


ఈ సినిమాలో హీరో విశాల్ పక్కన రాశికన్నా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా మొట్టమొదట తెలుగులో తీసిన దీనినే తమిళంలో ప్రధాన పాత్రలో హీరో గా చేస్తున్న విశాల్ మళ్లీ తెలుగులో కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు. ఒక తెలుగు సినిమాని పైగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమానే మళ్లీ తెలుగులో విడుదల చేయడానికి గల కారణం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కన్నా విశాల్ హై టెంపర్ యాక్టింగ్ చేసినట్లు దీంతో ఆ చిత్ర నిర్మాత తెలుగులో కూడా విడుదల చేస్తే జూనియర్ ఎన్టీఆర్ నటన తో పోలిస్తే విశాల్ నటనకు సినిమా హాల్ లో ఎక్కువ మార్కులు పడతాయి అన్న ఉద్దేశంతో ఈ సినిమా ని తెలుగులో కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.


అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ త్వరలో కోలీవుడ్ ఇండస్ట్రీలో జూన్ నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేయడం కోసం మల్కాపురం శివ కుమార్ తెలుగు హక్కులను

కొనటానికి రెడీగా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: