ఎన్నిక‌ల ఫ‌లితాలు ‘జ‌న‌సేన’ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిన నేపధ్యంలో జనసైనికులు తీవ్ర నిరాశలో  ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో రాజశేఖర్ నిన్న మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని తెప్పిస్తున్నాయి. నిన్నటి మీడియా సమావేశంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి రాజశేఖర్ తో మాట్లాడుతూ నాగబాబు ‘మా’ సంస్థ ఎన్నికలో జీవితా రాజశేఖర్ లకు మద్దతు ఇచ్చిన పరిస్థితులలో పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం న్యాయమా అంటూ అడిగిన ప్రశ్నకు రాజశేఖర్ ఒక విచిత్రమైన సమాధానం ఇచ్చాడు. 

‘చాలా మంది `మా` ఎన్నిక‌ల్లో నాగ‌బాబుగారు మీకు స‌పోర్ట్ చేశారుగా.. మ‌రి ఎలక్ష‌న్స్‌లో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని అడుగుతున్నారు. అంద‌రికీ నేను చెప్పేది ఒక‌టే. నాగ‌బాబుగారి నియోజ‌క వ‌ర్గానికి వెళ్లి నేను వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌లేదు. అలాగే భీమ‌వ‌రం నియోజ‌క వ‌ర్గానికి కూడా వెళ్ల‌లేదు. కానీ గాజువాక వెళ్లాల్సి వ‌చ్చింది. అది నా చేతుల్లో లేదు. అది పార్టీ నుండి వ‌చ్చిన ఆదేశం. పార్టీ ఇచ్చిన‌ లిస్టు ప్ర‌కారం నేను వెళ్లి ప్ర‌చారం చేశాను. నాకు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కోప‌మో, వ్య‌తిరేక‌తో ఉండుంటే.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ పెట్టి ఐదేళ్లు అయ్యింది. ఇన్నేళ్లలో నేను ఏదైనా మాట్లాడి ఉండొచ్చు క‌దా!. కానీ మాట్లాడ‌లేదు.’ అంటూ వివరణ ఇచ్చాడు.

అంతేకాదు అప్ప‌ట్లో ‘ప్ర‌జారాజ్యం’ పార్టీ పెట్టిన‌ప్పుడు తనను టార్గెట్ చేసిన చిరంజీవి అభిమానుల పై మాట్లాడని చాలామంది తనను అడిగినా తాను స్పందించ లేదనీ అయితే అనుకోకుండా తాను పార్టీ ఆదేశంతో గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి వచ్చిందని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే తాను ఎప్పుడు ఏది మాట్లాడినా ఆ మాటలు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మారడం తన దురదృష్టం అంటూ కామెంట్స్ చేసాడు. 

ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి రాజశేఖర్ అనుకోకుండా చేసిన కామెంట్ పెను వివాదాన్ని సృష్టిస్తోంది. ఫ‌లితాలు త‌ర్వాత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స్టేట్‌మెంట్ ఇస్తున్నప్పుడు తాను పవన్ ముఖ కవళికలు చూసినప్పుడు తనకు చాల జాలి కలిగిందనీ కనీసం పవన్ పోటీ చేసిన ఎదో ఒక్క స్థానంలో తను గెలుస్తాడని భావించాను అంటూ రాజశేఖర్ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. అనవసరంగా మళ్ళీ పవన్ అభిమానుల టార్గెట్ కు రాజశేఖర్ గురి కావడం హాట్ టాపిక్ గా మారింది..    



మరింత సమాచారం తెలుసుకోండి: