ఒక హీరోయిన్ దశాబ్దకాలం పైగా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం అనుకుంటే ఏకంగా 50 సినిమాలకు పైగా నటించడం మరింత కష్టం. ఈ రెండు రికార్డులను కాజల్ సొంతం చేసుకుంది. కాజల్ పెళ్ళి విషయమై ఎన్నో సార్లు గాసిప్పులు వచ్చినా వాటి గురించి స్పందించని కాజల్ ఇప్పుడు తన కొడుకు ఇషాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. 

లేటెస్ట్ గా విడుదలైన ‘సీత’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ తన కొడుకు ఇషాన్ విషయాలు బయటపెట్టింది. పేరుకు ఇషాన్ తన చెల్లెలి కొడుకే అయినా ఆ బేబి చుట్టూ తన ఆలోచనలు ఉంటాయని ప్రపంచంలో ఆ చిన్నారి కోసం ఏది అడిగినా ఇవ్వాలని తనకనిపిస్తుందని అంటూ తన చెల్లెలి కొడుకు పై తనకు ఉన్న ప్రేమను బయట పెట్టింది. 

అంతేకాదు మాతృత్వంలోని ఆనందాన్ని తనకు పిల్లలు కనకుండానే ఇషాన్ ద్వారా తెలిసింది అంటూ కామెంట్స్ కూడ చేసింది. ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న తనకు ఇషాన్ మాత్రమే సర్వస్వం అంటోంది కాజల్. ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు ఖంగారు పడి పెళ్ళి చేసుకోవడం ఆతరువాత అభిప్రాయాలు కుదరక విడిపోవడం లాంటి విషయాలు నచ్చవనీ అందువల్ల నిదానంగా తనకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు మాత్రమే పెళ్ళి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది కాజల్.

తనకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం అని చెపుతూ తనకు ఇష్టం ఉన్నా రానిపని ఒక్క కవిత్వం వ్రాయడం ఒక్కటే అని చెపుతూ ఎప్పటికైనా ఒక మంచి కవితల పుస్తకం వ్రాయాలని ఉన్న తన కోరికను బయట పెట్టింది. ప్రస్తుతం తాను తరుచూ ఆధ్యాత్మిక కేంద్రం ‘ఈశా’ కు వెళ్ళి అక్కడ ఆధ్యాత్మికంగా వికాశం పొందడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ తన దృష్టిలో సినిమా కెరియర్ ఒక ఉద్యోగం లాంటిది మాత్రమే అంటూ తన జీవితంలో సాధించవలసిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి అంటోంది ఈ పంచదార బొమ్మ..



మరింత సమాచారం తెలుసుకోండి: