సినిమాల పై ఉండే వ్యామోహంతో సుమారు 20 సంవత్సరాల క్రితం 18 వేల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని తొలి ప్రయత్నంగా తీసిన ‘మున్నా’ పరాజయం చెందినా తడబాటు పడకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. ‘మహర్షి’ మూవీ సక్సస్ తో టాప్ డైరెక్టర్స్ లిస్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ దర్శకుడు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాల పై స్పందించాడు.

2002 సంవత్సరంలో ఇండస్ట్రీకి సహాయ దర్శకుడుగా వచ్చిన తాను చాల తడబాట్లకు గురి అయ్యానని అయితే ఎవరికైనా పరాజయాలే పాఠాలు నేర్పిస్తాయి అంటూ కామెంట్స్ చేసాడు. తన చిన్నప్పటి నుంచి తన తల్లి తండ్రులు చాల గారాబంగా పెంచడంతో విలాసవంతమైన వాతావరణంలో పెరిగిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను ఇండస్ట్రీలో నిలబడటానికి పడ్డ కష్టాలను వివరించాడు. 

ఇక తాను దర్శకుడుగా మారి సక్సస్ అందుకోవడంలో తన సమర్ధతతో పాటు తన అదృష్టం కూడ ఉందనీ ఆ అదృష్టం పేరు ‘మాలినీ’ అంటూ తన భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండే రోజులలో తన భార్య మాలిని తనకు ఒక షూటింగ్ లో పరిచయమైన విషయాన్ని వివరించాడు. 
అయితే అప్పట్లో తాను కేవలం సహాయ దర్శకుడుగా ఉన్న నేపధ్యంలో తన భార్య మాలిని తల్లి తండ్రులు తమ పెళ్ళికి అంగీకరించలేదు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

అంతేకాదు తన భార్య వద్ద ఉండే సెల్ ఫోన్ ను ఆమె తల్లితండ్రులు లాగేసుకుని తమ మధ్య మాటలు లేకుండా చేయడానికి ప్రయత్నించిన సందర్భాలు ఒక సినిమా సీన్ లా ఉంటాయి అన్న అప్పటి విషయాలను బయట పెట్టాడు. అయితే తామిద్దరం ఎంతో కష్టంతో తమ తల్లితండ్రులను ఒప్పించి పెళ్ళి చేసుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తన దృష్టిలో తన అదృష్టం తన భార్య మాలిని మాత్రమే ఆమె కోసమే దర్శకుడుని అయ్యాను.. అని అంటున్నాడు ..



మరింత సమాచారం తెలుసుకోండి: