సౌత్ లో స్వీటీ అనుష్క అంటే ఇష్టపడని వారు ఉండరు. కథానాయికగా కమర్షియల్ సినిమాల్లో తన అందచందాలతో అలరిస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. అరుంథతి సినిమా తర్వాత అనుష్క రేంజ్ మారిపోయింది. అందుకే రుద్రమదేవి, భామతి లాంటి సినిమాలు అనుష్క చేయడం వల్లే హిట్ అయ్యాయి.


కేవలం ఆడియెన్స్ ను మాత్రమే కాదు సిని సెలబ్రిటీస్ ను ఇంప్రెస్ చేస్తుంది అనుష్క. అనుష్కని ఇష్టపడే వారిలో టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వారిలో యువ హీరో నాగా శౌర్య ఒకరు. చిన్నప్పటి నుండి ఆటల మీద తన ఇంట్రెస్ట్ ఉండేదని చెప్పిన నాగ శౌర్య సినిమాల్లోకి రాకముందు నుండి అనుష్క అంటే చాలా ఇష్టమని చెప్పాడు.


ఇప్పుడు తను హీరోగా సినిమాలు చేస్తున్నా ఇప్పటికి అనుష్క అంటేనే తనకు ఇష్టమని అంటున్నాడు. అనుష్కతో నటించే ఛాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని.. తన సినిమాల్లో అనుష్క నటించే అవకాశం వస్తే ఆ ఛాన్స్ ఏమాత్రం వదలనని అంటున్నాడు నాగ శౌర్య. అనుష్కతో జోడీ కట్టాలన్న మనవాడి ఆశ ఎప్పటికైనా తీరుతుందేమో చూడాలి.


ఇక అనుష్క విషయానికొస్తే లేటెస్ట్ గా సైలెన్స్ అనే సినిమా మొదలు పెట్టారు. భాగమతి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అనుష్క సైలెన్స్ సినిమాతో పాటుగా సైరాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. అనుష్క మీద తన అభిమానం చూపిస్తున్న నాగ శౌర్య ఏదో ఒకరోజు ఆమెతో నటించే ఛాన్స్ కొట్టాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: