ఈ సారి లోక్‌స‌భ‌కు చాలా మంది కొత్త ముఖాలు ఎంపీలుగా గెలిచారు. ఇక తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌తో లింక్ ఉన్న వారిలో కూడా చాలా మంది ఈ సారి లోక్‌స‌భ‌లో అడుగు పెట్ట‌నున్నారు. తెలుగులో సీనియ‌ర్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన సుమ‌ల‌త మండ్య నుంచి లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో మార్గాని భ‌ర‌త్‌రామ్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి వైసీపీ త‌ర‌పున చిన్న వ‌య‌స్సులోనే ఎంపీ అయ్యారు. ఇక మ‌న తెలుగు హీరోయిన్ జ‌య‌ప్ర‌ద రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ముంబైలో ఊర్మిల కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయారు. ఇదిలా ఉంటే తనదైన అందం చందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన కథానాయిక నవనీత్ కౌర్ ఇప్పుడు లోక్‌స‌భ‌లోకి అడుగు పెట్ట‌నుంది.


తెలుగులో న‌వ‌నీత్‌కౌర్ చాలా మందికి తెలుసు. ఆమె ఇక్క‌డ ఆర్పీ ప‌ట్నాయ‌క్ శీను వాసంతి లక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్వ‌త‌హాగా పంజాబీ బ్యూటీ అయిన ఆమె శీను వాసంతి లక్ష్మీ - శత్రువు - మహారధి సినిమాల్లో నటించింది. చాలా హాట్ హాట్‌గా లుక్స్‌, స్టిల్స్‌తో ఇక్క‌డ ఓ వెలుగు వెల‌గాల‌ని చూసినా ఆమెకు స‌రైన ఛాన్సులు రాలేదు. అలాగే కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఇండ‌స్ట్రీని వ‌ద‌లేశాక ఆమె మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 


ఆ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు అమ‌రావ‌తి ఎమ్మెల్యే రవిరాణా. ర‌విరాణా స్వాభిమాన్ పార్టీ త‌ర‌పున తొలి నుంచి పోటీ చేస్తూ అక్క‌డ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఆయ‌న‌కు అక్క‌డ స్థానికంగా మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఎన్నిక‌ల్లో న‌వ‌నీత్‌కౌర్ కూడా భ‌ర్త అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తూ ఎంపీగా పోటీ చేశారు. మహారాష్ట్ర లోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి శివసేన పార్టీ అభ్యర్థిపై దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఆమెకు 5.10 ల‌క్ష‌ల ఓట్లు పోల‌య్యాయి.


న‌వ‌నీత్ భ‌ర్త ర‌వి రాణా ఎవ‌రో కాదు బాబా రామ్‌దేవ్‌కు స్వ‌యానా మేన‌ల్లుడు. త‌క్కువ వ‌య‌స్సులోనే ఎంపీగా గెలిచిన హీరోయిన్‌గా న‌వ‌నీత్ రికార్డు క్రియేట్ చేసింది. గ‌తంలో క‌ర్నాట‌క‌లో మండ్య నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా కాంగ్రెస్ త‌ర‌పున ర‌మ్య చిన్న వ‌య‌స్సులోనే లోక్‌స‌భ‌లో అడుగు పెట్టిన రికార్డు ద‌క్కించుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: