హీరోయిన్ మాధవిలత పవన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఈమె ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడమే కాకుండా ఈమె ఈమధ్య జరిగిన ఎన్నికలో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఈమె మీడియా వర్గాలతో మాట్లాడుతూ తాను  ఓడిపోతానని తనకు ముందే తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

అందుకే తన ఎన్నికల ప్రచారంలో  తాను గెలుస్తాను అనే మాట వాడలేదు అని అంటూ కేవలం మోడీ మళ్ళీ రావాలి అని మాత్రమే ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. ఇదే సందర్భంలో ఆమె పవన్ కళ్యాణ్ ఓటమి పై స్పందిస్తూ పవన్ ఓటమి తనకు విడ్డూరంగా ఉంది అని కామెంట్స్ చేసింది. అంతేకాదు పవన్ ఓటమిని తాను జీర్ణించు కోలేక పోతున్నాను అంటూ తన భాదను వ్యక్త పరిచింది. 
 
ఇదే సందర్భంలో ఆమె పవన్ ఫ్యాన్స్ ఏమయ్యారు? ఎన్ని మాటలు చెప్పారు? ఇదేనా ఫాన్స్  ప్రేమ  అంటూ మాధవీ  లత ప్రశ్నలు వేస్తూ పవన్ కోసం అతడి అభిమానులు సరిగ్గా పని చేయలేదు అన్న సంకేతాలు ఇచ్చింది. ఇక్కడే  ఆమె మరొక ట్విస్ట్ ఇస్తూ ఈ ఎన్నికలలో ఓటర్లు డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాము మాకు నిజాయితీ పరులొద్దని  ఓటర్లు అంతర్లీనంగా చెప్పారు అంటూ ఈమె అభిప్రాయ పడుతోంది. చదువుకున్న వారు మంచి వారు రాజకేయాల్లోకి రావాలి అంటూ చెప్పేవారే జేడీ లక్ష్మినారాయణకు ఓట్లు వేయకపోవడం షాకింగ్ గా ఉంది అంటూ మాధవీ లత కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం మాధవీ లత చేసిన కామెంట్స్ పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. అయితే ఎన్నికలలో  విజయం సాధించాలి అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా మహిళలు ఉద్యోగులు శ్రామికులు రైతులు వృద్ధులు  ఇలా అన్నివర్గాల ఓట్లు పడినప్పుడు మాత్రమే విజయం వస్తుంది. ఈ కనీస విషయం కూడా మాధవీ లతకు తెలియదా అన్నదే ప్రశ్న.. 



మరింత సమాచారం తెలుసుకోండి: