బిగ్ బాస్ సీజన్ 3 కు రంగం సిద్ధం అవుతుంది. మొదటి రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా నడిపించిన బిగ్ బాస్ టీం సీజన్ 3ని ఇంకాస్త గొప్పగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ హోస్ట్ గా ఎవరు చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఫిక్స్ అయ్యాడని తెలిసిందే. ఇక కంటెస్టంట్స్ విషయంలో కూడా కొన్ని కండీషన్స్ పెట్టాడట.


శ్రీముఖి, ఉదయభాను, వరుణ్ సందేష్ లతో పాటుగా బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా ఈసారి కంటెస్టంట్ గా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈసారి బిగ్ బాస్ రచ్చ రంబోళానే అనుకున్నారు. శ్రీముఖి, గుత్తాజ్వాలా ఇలా ముద్దుగుమ్మలంతా ఇంటి సభ్యులుగా చేసే హంగామా ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని గుత్తా జ్వాలా ఈలోగా షాక్ ఇచ్చింది. 


తాను బిగ్ బాస్ కంటెస్టంట్ గా చేయట్లేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే గుత్తా జ్వాలాని కంటెస్టంట్ గా అడిగిన విషయం నిజమే కాని రెమ్యునరేషన్ దగ్గర తేడా కొట్టి ఆమె వెనక్కి తగ్గిందని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో వారాల వారిగా రెమ్యునరేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే.


గుత్తా జ్వాలా అడిగిన రెమ్యునరేషన్ బిగ్ బాస్ నిర్వాహకులు ఇవ్వనన్నారట. అందుకే ఆమె షోలో పాటిస్పేట్ చేయనని చెప్పిందట. నితిన్ సినిమాలో ఓ సాంగ్ లో సర్ పైజ్ ఇచ్చిన గుత్తా జ్వాలా సినిమాల్లో నటిస్తుందని అన్నారు. కాని అది కూడా జస్ట్ రూమర్ అని తెలిసింది. బిగ్ బాస్ 3 ఎలా ఉంటుంది.. కంటెస్టంట్ గా ఎవరు సర్ ప్రైజ్ చేస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: