భారత చలన చిత్ర చరిత్రలో ఇప్పటివరకు లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు మన దర్శక, నిర్మాతలు. కానీ ఇలాంటి ప్రయోగం ఇప్పటివరకు ఏ దర్శక నిర్మాత చేయలేదనే ఖచ్చితంగా చెప్పొచు. ఏదైనా ఒక సినిమాను తీసుకుంటే ఆ సినిమాకు దర్శకుడు సంగీత దర్శకుడు ఎడిటింగ్ సినిమాటోగ్రాఫర్ ఇలా వివిధ విభాగాలకు ఒక్కొక్క టెక్నీషియన్ మాత్రమే ఉంటారు. ఇక చాలా అరుదుగా మాత్రమే ఒక్కో సినిమాకి ఇద్దరేసి టెక్నీషియన్స్ ఉంటారు. కొన్ని సినిమాలకు ఇద్దరు ముగ్గురు దర్శకత్వం చేయడం కొన్ని సినిమాలకు ఇద్దరు ముగ్గురు సంగీతాన్ని అందించడం ఇప్పటివరకు సాధారణంగా జరిగిన విషయమే. 


కాని ఒకే సినిమాకు ఆరుగురు సంగీత దర్శకులు - ఆరుగురు సినిమాటోగ్రాఫర్ లు - ఆరుగురు ఎడిటర్ లు వర్క్ చేయడం ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మొదటి సారి ఒక తమిళ సినిమాకు ఈ అద్భుతం జరుగబోతుంది. శంకర్ శిష్యుడు చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా  'కసాడ తబార'. ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. అదేంటంటే ఈ సినిమాలో ఆరు పోర్షన్ లలో కథ ఉంటుంది. ఆరు పోర్షన్ లకు ఆరుగురు దర్శకులు స్క్రీన్ ప్లే అందించారు. సినిమా ఆరు పోర్షన్ లకు గాను ఆరుగురు సంగీత దర్శకులు వేరు వేరుగా, సినిమాటోగ్రాఫర్స్ ఎడిటర్స్ వర్క్ చేయబోతున్నారు. అది కూడా టాప్ టెక్నీషియన్స్.


విజయ్ తో పులి అనే భారీ సినిమాని  తెరకెక్కించి దెబ్బ తిన్న దర్శకుడు చింబుదేవన్ ఈ చిత్రంతో కొత్త ప్రయోగంను చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా, సీన్ రొనాల్డ్, ప్రేమ్ జీ, శామ్, సంతోష్ నారాయణ్, జిబ్రాన్ లు సంగీతం అందిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: