‘ఆర్ ఎక్స్ 100’ సూపర్ హిట్ కావడంతో కేవలం ఆ ఒకేఒక్క సినిమా క్రేజ్ తో పాయల్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో ఐదు సినిమాలు చేస్తూ మరో ఐదు సినిమాల ప్రపోజల్స్ ను లైన్ లో పెట్టింది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె పంజాబ్ కు చెందిన ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది అని తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.

చిన్నతనం నుండి చదువులో పెద్ద ఏకాగ్రత కనపరచని ఈమె గురించి ఆమె తల్లితండ్రులు చాల ట్యూషన్స్ పెట్టి ఖర్చు చేస్తూ ఉండేవారట. తన చదువు పై ఎందుకు అలా ఖర్చు చేస్తున్నారు ముంబాయి పంపితే తాను సినిమాలలో అవకాశాలు వెతుక్కుని హీరోయిన్ గా మారిపోతాను అంటూ ఆమె చిన్నతనంలోనే చెప్పింది అంటే సినిమాల పై ఆమెకు ఉన్న మొజ అర్ధం అవుతుంది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘ఆర్ డి ఎక్స్ లవ్’ షూటింగ్ కోసం పాపికొండలు వెళ్ళినప్పుడు అక్కడ తనను కలిసిన ఒక మీడియా సంస్థ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలోని విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈమూవీలో వేశ్య పాత్రలో నటించడం మీ కెరియర్ కు నెగిటివ్ పాయింట్ గా మారిందా అన్న విషయం పై స్పందిస్తూ పాయల్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఈసినిమా ఒప్పుకున్నా తరువాత వేశ్యల జీవితాల గురించి వారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాను అంటూ కేవలం వాళ్ళు బ్రతకడానికి అలాంటి పనులు చేస్తుంటే దానిని ఆపేయమని చెప్పే హక్కు ఎవరికీ లేదు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఎవరి జీవితం వారి ఇష్టం కాబట్టి పలానా పని చేయాలి పలానా పని చేయకూడదు అంటూ నిబంధనలు పెట్టడం తనకు నచ్చదు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు అనుష్క టబూ రాణీముఖర్జీ లాంటి టాప్ హీరోయిన్స్ వేశ్య పాత్రలు చేస్తే లేని అభ్యంతరం తాను నటిస్తే ఎముడుకు మీడియాకు వస్తోంది అంటూ ఆమె ఎదురు ప్రశ్నిస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: