డైరెక్టర్ తేజ ఏవిషయం పై అయినా చాల స్పష్టంగా తన మనసులోని మాటలను ఎటువంటి మొహమాటం లేకుండా చెపుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తిత్వం వల్ల సమర్ధత ఉండి కూడ తేజా దర్శకుడుగా ఎదగలేకపోయాడు అన్న కామెంట్స్ ఉన్నాయి.

లేటెస్ట్ గా ఇతడు దర్శకత్వం వహించిన ‘సీత’ మూవీకి ఏవరేజ్ టాక్ వచ్చినా ఆసినిమాను కలక్షన్స్ పరంగా నిలబెట్టడానికి తేజ చాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ ఏకంగా వెంకటేష్ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చాడు. 

తాను ఒకేరోజున ఎన్టీఆర్ బయోపిక్ అదేవిధంగా వెంకటేష్ తో తీయాలని భావించిన రెండు సినిమాలను వదులుకున్న విషయాలను వివరించాడు. ఇదే సందర్భంలో వెంకటేష్ తో తాను చేయవలసిన మూవీ క్యాన్సిల్ పై స్పందిస్తూ తన మూడ్ బాగుండకపోవడంతో ఆమూవీని తాను వదులుకున్నాను అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. 

ఇప్పడు తేజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో మూడ్ వెంకటేష్ కు సరిగ్గా లేక తేజా సినిమా ఆగిపోయిందా లేకుంటే తేజ మూడ్ వల్ల వెంకీ ఆగిపోయాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. వాస్తవానికి తేజా వెంకటేష్ తో తీయాలనుకున్న మూవీ కథ ఫైనల్ అయినా ఆ కథ విషయంలో వెంకటేష్ చెప్పిన మార్పులు చేర్పులు తేజా సకాలంలో చేయలేకపోవడంతో వెంకీ ఆమూవీని వదులుకుని ‘వెంకీ మామ’ సినిమాను చేస్తున్నాడు అన్నది ఓపెన్ సీక్రెట్. దీనితో అందరికీ తెలిసిన విషయాలను తేజా మరొక విధంగా చెపుతూ తన ఇగోను బయటపెట్టుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: