తెలుగు సినిమాలు తమిళ, హింది భాషల్లో రీమేక్ అవడం కామనే.. యూనివర్సల్ కాన్సెప్ట్ అయితే రీమేక్ బదులుగా డబ్ చేసి రిలీజ్ చేస్తారు.. అలా కుదరని సినిమాలను రీమేక్ రైట్స్ తీసుకుని సినిమాలు చేస్తారు. అయితే అలానే తెలుగులో సూపర్ హిట్టైన ఎన్.టి.ఆర్ టెంపర్ సినిమాను తమిళంలో అయోగ్య పేరుతో రీమేక్ చేశారు.


విశాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనని హీరో విశాల్ అన్నాడు. ఆల్రెడీ టెంపర్ ఇక్కడ రిలీజైంది కాబట్టి ఆ సినిమానే తాము రీమేక్ చేస్తున్నామని.. కాబట్టి తెలుగులో ఆ సినిమా రాకపోవచ్చని అన్నాడు. కాని ఇప్పుడు అయోగ్యని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.


అదేంటి అంటే సినిమా కథ సేం అయినా క్లైమాక్స్ తో పాటుగా మీటూకి సంబందించిన కొన్ని సీన్స్ యాడ్ చేశారట. ఇవి తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నాడు విశాల్. టెంపర్ లో తారక్ లా తను నటించలేనని చెప్పిన విశాల్ మరి ఇప్పుడు తారక్ సినిమాతో తెలుగులో రావడానికి సాహసించాడు.


రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమిళంలో క్రేజ్ భారీగానే ఉంది. తెలుగులో ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. ఠాగూర్ మధు తమిళంలో మొదటిసారి నిర్మించిన సినిమా ఇది. విశాల్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కచ్చితంగా సినిమా విశాల్ కెరియర్ లో మంచి సినిమాగా నిలుస్తుందని చెబుతున్నాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: