కోలీవుడ్ లో హాట్ కపుల్ లిస్ట్ లో ఉన్న శింబు, హాన్సిక మళ్లీ ప్రేమ పక్షులుగా విహరిస్తున్నారన్న టాక్ కోలీవుడ్ అంతా పాకింది. నేడో రేపో పెళ్లని అనుకున్న ఈ జంట సడెన్ గా ఎవరి దారి వారు వెతుక్కున్నారు. ఈమధ్య సినిమాలు కూడా తగ్గించిన శింభు మళ్లీ ఫాంలోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. 


ఇక మరోపక్క హాన్సిక కూడా కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినా ఈమధ్య ఆమెకు అవకాశాలు లేకుండాపోయాయి. ఇద్దరి కెరియర్ సందిగ్ధంలో పడటంతో మళ్లీ ఈ ఇద్దరు కలిసిపోయారని తెలుస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో శింభు హాన్సిక ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారట. పార్టీలు పబ్బులు అంటూ తెగ తిరిగేస్తున్నారట.


అయితే హాన్సికతో పెళ్లిపై శింభు ఈమధ్యనే స్పందించాడు.. ఇప్పుడప్పుడే పెళ్లి ఉద్దేశం లేదంటూ చెప్పాడు. అలాంటిది ఏదైనా ఉంటే తానే స్వయంగా చెబుతా అన్నాడు. హాన్సిక పేరు ఎత్తకుండా శింభు కామెంట్స్ చూస్తుంటే హాన్సికతో పెళ్లికి రెడీ అన్నట్టుగానే ఉంది. ఓ పక్క తన మాజీ లవర్ నయనతార కూడా విఘ్నేష్ శివన్ తో పెళ్లికి రెడీ అవుతుంది.


నయనతార పెళ్లికి ముందే శింభు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. మరి అది హాన్సికతోనేనా కాదా అన్నది చూడాలి. కోలీవుడ్ యువ హీరోలు కూడా పెళ్లి చేసుకుంటుండగా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్న శింభు పెళ్లి ముహుర్తం ఎప్పుడు బయటపడుతుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: