ఇలా ప్రేమ వ్యవహారాలే కాదు మహిళలను కించ పరిచారని..ఆరోపణలు కూడా వచ్చాయి. ఎన్ని వివాదాలు ఉన్న శింబు మాత్రం హీరోగా తన సత్తా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు శింబు. తాజాగా ఈ మన్మథుడు పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల శింబు సోదరుడు కురళరసన్ ఓ ఇంటివాడయ్యాడు.
కురళరసన్, నబీలా అహ్మద్ అన్నాశలైలోని మసీదులో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. ఏప్రిల్ 26న వీరి వివాహం జరిగింది. శింబు ఫ్యామిలోనే ఒక అమ్మాయిని చూడగా, ఆమెతో ఆగస్ట్‌లో పెళ్లిపీటలెక్కనున్నాడట శింబు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు.