‘నాపేరు సూర్య’ ఘోర పరాజయం తరువాత అనేక ఆలోచనలు చేసి అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి దిల్ రాజ్ ప్రస్తుతం చేస్తున్న రాయబారాలు వారిద్దరినీ అయోమయంలో పడేస్తున్నట్లు టాక్. త్రివిక్రమ్ బన్నీల మూవీ కీలక షెడ్యూల్ ఈనెల 30న మొదలై వరసగా 30 రోజులు కొనసాగి ఈమూవీకి సంబంధించిన కీలక సీన్స్ ను షూట్ చేసే వ్యూహాలలో కొనసాగుతోంది. 

వాస్తవానికి ఈసినిమాను వేగంగా పూర్తి చేసి అక్టోబర్ లో వచ్చే దసరా రేస్ లో విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే అక్టోబర్ 2న చిరంజీవి ‘సైరా’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈమూవీని సంక్రాంతి రేస్ కు విడుదల చేయాలని భావించారు. 

అయితే ఇప్పుడు ఈ ఆలోచనలకు చాల ముందుగానే దిల్ రాజ్ చెక్ పెడుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ అనీల్ రావిపూడిల మూవీ ప్రారంభోత్సవం ఈనెల 31న సూఅర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున జరగబోతోంది. అంతేకాదు ఈసినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజ్ ఈమూవీని సంక్రాంతి రోజున విడుదల చేయబోతున్నట్లు ఈమూవీ ప్రారంభోత్సవం రోజునే ప్రకటిస్తాడని టాక్. దీనితో బన్నీ సంక్రాంతికి మహేష్ తో పోటీ పడవలసి వస్తుంది. దీనికితోడు బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీని కూడ సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం. 

ఇలాంటి పరిస్థుతులలో అనవసరపు పోటీ వద్దని చెపుతూ దిల్ రాజ్ అల్లు అర్జున్ మూవీని ఈ ఏడాది నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ విడుదల చేసుకోమని రాయబారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో అల్లు అర్జున్ తెగించి మహేష్ బాలకృష్ణలతో సంక్రాంతికి పోటీ అయినా పడాలి లేదంటే తెలుగు సినిమాల మార్కెట్ కు పెద్దగా కలిసిరాని నవంబర్ డిసెంబర్ లలో అయినా రావాలి అన్న మాటలు వినిపిస్తున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: