సీనియర్ హీరోల దగ్గర నుండి నేటితరం యంగ్ హీరోల వరకు చాలామందికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇదే దారిని ఎంచుకోవడమే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థకు ‘కింగ్ ఆఫ్ ది హిల్స్’ అనే పేరు పెట్టడం పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

తన మనసులోని ఏమాటను అయినా ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడే విజయ్ దేవరకొండకు ఉన్న ఇగో లాగే అతని ప్రొడక్షన్ హౌస్ పేరులో కూడ ఇగో కనపడుతోంది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ బ్యానర్ పై విజయ్ తనకు ‘పెళ్ళి చూపులు’ మూవీతో బ్రేక్ యిచ్చిన తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. 

ఆతరువాత విజయ్ దేవరకొండ నటించే అన్ని సినిమాలకు ఈ ప్రొడక్షన్ హౌస్ సహనిర్మాతగా వ్యవరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీ విడుదల అయ్యాక క్రాంతి మాధవ్ అదేవిధంగా తమిళ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై సినిమాలు పూర్తి అయ్యాక ఆపై విజయ్ నటించే అన్ని సినిమాలలోను ఈ కింగ్ ఆఫ్ హౌస్ బ్రాండింగ్ కనపడుతుందని టాక్.

అయితే మహేష్ చరణ్ నానీలు లాంటి హీరోలు తమ సొంత ప్రొడక్షన్ హౌస్ లని ఇండస్ట్రీలో పూర్తిగా స్థిరపడిపోయిన తరువాత పెట్టుకున్నారు. కానీ విజయ ఇంకా టాప్ యంగ్ హీరోల లిస్టులో పూర్తిగా చేరకుండానే తన ప్రొడక్షన్ హౌస్ ను క్రియేట్ చేసుకోవడం ద్వారా విజయ్ అతి వేగంగా టాప్ యంగ్ హీరోలతో సమానంగా సంపాదన సంపాదించాలి అన్న వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: