రాఘవ లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న హారర్‌, కామెడీ చిత్రం ‘కాంచన1’ హిందీలోకి రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే.  టాలీవుడ్, కోలీవుడ్ లో ముని సీక్వెల్ గా వస్తున్న సినిమాలకు ఇక్కడ ఎంతో ఆదరణ లభిస్తుంది.  హర్రర్ సినిమాలకు కొత్త భాష్యం చెప్పిన లారెన్స్ వరుసగా విజయాలు అందుకుంటున్నారు.  కాంచన సినిమా కన్నడలో రిమేక్ అయిన విషయం తెలిసిందే. 


తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు ఈ మద్య ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.  అయితే ఇక్కడ లారెన్స్ కి ఘోర అవమానం జరిగిందని..లారెన్స్ కి తెలియకుండానే..అతని సూచనలు సలహాలు తీసుకోకుండానే ‘లక్ష్మీబాంబ్’అంటూ అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంపై లారెన్స్ చాలా అవేదన చెందారు.   తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ లారెన్స్ వారితో కలిసి పని చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో స్వయంగా అక్షయ్ ఈ విషయంలో జోక్యం చేసుకొని లారెన్స్ ని బుజ్జగించే పనిలో పడ్డారని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు  నిర్మాత చెన్నై వచ్చి లారెన్స్‌తో మంతనాలు జరిపారని, అవి ఓకే కావడంతో మళ్లీ దర్శకత్వం వహించేందుకు లారెన్స్‌ అంగీకరించారని కోలీవుడ్‌ సమాచారం. త్వరలోనే చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌లో లారెన్స్‌ పాల్గొననున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: