ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు అందరూ రష్మిక మ్యానియాతో అడుగులు వేస్తున్నారు. మహేష్‌ అల్లు అర్జున్‌ల సినిమాలకే కాకుండా యువ హీరోల చిత్రాలకి కూడా ఆమెను అడుగుతున్నారు. 

పారితోషికం విషయంలో రాజీపడకుండా రష్మిక ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నా మరో సంవత్సరం వరకూ రష్మిక డైరీలో ఒక్కరోజు కూడ ఖాళీ లేకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈమె ఇటీవలే కార్తీ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది. 

లేటెస్ట్ గా తమిళ టాప్ హీరో విజయ్ ఆమెకు ఆఫర్ ఇచ్చినా తన వద్ద డేట్స్ లేకపోవడంతో ఆసినిమాను ఒప్పుకోలేని పరిస్థితిలో రష్మిక ఉన్నట్లు సమాచారం. 
వాస్తవానికి కొన్ని నెలల క్రితం విజయ్‌ సినిమాలో రష్మిక హీరోయిన్‌ అనే వార్త వచ్చినప్పుడు ఈమె స్పందిస్తూ అనవసరంగా లేనిపోని ఆశలు రేపకండి అంటూ కామెంట్ చేసింది. అయితే అలాంటి ఆఫర్ ఆమెకు వచ్చినా రష్మిక ఒప్పుకోలేని స్థితిలో ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో ఇలా సమంతకు వరసపెట్టి తెలుగులో తమిళంలో అవకాశాలు వచ్చేవి. అయితే సమంతకు పెళ్ళి అయిన తరువాత టాప్ హీరోలు ఎవరు అటు తెలుగులో కాని ఇటు తమిళంలో కానీ సమంతతో నటించడానికి ఇష్టపడని పరిస్థుతులలో ఇప్పుడు అందరికీ ఒక్క రష్మిక మాత్రమే ఆధారంగా మారింది. తెలుగు ఇండస్ట్రీలో కూడ ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్న పరిస్థుతులలో రానున్న రోజులలో రష్మిక సమంత స్థానాన్ని భర్తీ చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: