వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సమైన రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రంలోనే కాక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులు ఎంత కన్నా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యంత గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.


చెన్నైలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. 18 రోజుల్లో చెన్నైలో మహర్షి కోటికి పైగా కలెక్షన్స్ ను రాబట్టి బయ్యర్స్ కి మంచి లాభాలను అందించింది. ఇది కూడా మహేష్ కెరీర్ లో ఓ రికార్డే.కాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచిందన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.


ప్రస్తుతం ఈ సినిమా హిట్ అవడంతో అల్లరి నరేష్ కెరీర్ కూడా గడి లో పడింది. అల్లరి నరేష్ కి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. దీనంతటికీ కారణం మహర్షి సినిమా అని చాలామంది అంటున్నారు. మరోపక్క మహేష్ బాబు అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా ను ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్న క్రమంలో వచ్చేనెల ఎండల తీవ్రత తగ్గాక మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: