ఎంతమంది యంగ్ హీరోయిన్స్ వస్తున్నా ప్రస్తుతం ఆమెకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోయినా త్రిష చేతిలో సుమారు ఆరు సినిమాలు ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. ఇప్పటికీ కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. 

గత ఏడాది ఆమె నటించిన '96' తో ఘన విజయం సాధించిన తరువాత త్రిష మ్యానియా మరింత కోలీవుడ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలలో 'రాంగి' ఒకటి  ఎం. శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీకి ఎఆర్ మురుగదాస్ కథ అందించడంతో ఈమూవీ పై కూడ అంచనాలు బాగా పెరిగాయి. 

ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో తన అభిమానులతో ఛాటింగ్ చేసింది. ఈ సందర్భంలో ఒక అభిమాని త్రిష పర్సనల్ లైఫ్ గురించి అడిగినప్పుడు ఇచ్చిన హింట్ వెనుక అర్ధం ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుతున్నాయి. ఆ అభిమాని త్రిషను ప్రస్తుత రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడిగాడు. దానికి సమాధానంగా త్రిష "సింగిల్ బట్ టేకెన్' అంటూ సమాధానం ఇచ్చింది. దీనితో ఆమె వాడిన పదం వెనుక అర్ధం ఏమిటి అంటూ చాలామంది అర్ధాలు వెతకడం మొదలు పెట్టారు. 

సింగిల్ అంటే మారిటల్ స్టేటస్ సింగిల్ అని అర్థం అవుతుంది. 'టేకెన్' అంటే ఏంటి?  అని పరిశోధన ఒక వ్యక్తితో తోనే అనుబంధం కొనసాగిస్తూ మరో ఆప్షన్ లేదా మరో పార్ట్నర్ గురించి ఆలోచించకపోవడాన్ని టేకెన్ అని అర్ధం వచ్చింది. దీనితో ప్రస్తుతం త్రిష ఒంటరిగా లేదనీ మరేవ్వరితోనో కలిసి ఉంటోందని ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటూ కోలీవుడ్ మీడియా త్రిష ప్రస్తుత ప్రియుడు గురించి అన్వేషణ చేస్తూ అనేక ఊహాగానాలు చేస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: