ఇటీవల జెర్సీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నాని ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ప్రముఖుల చేత తన నటనకు అనేక ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇదే క్రమంలో తన తర్వాత సినిమా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూ మరోవైపు తనకు మొట్టమొదటిసారిగా హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘వి’ సినిమా చేస్తున్నారు.


మరి అదే కాకుండా ఈ సినిమాలో విలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం నాని కాల్షీట్స్‌ కోసం రెండు ఆసక్తికరమైన కథలు ఎదురు చూస్తున్నాయని టాక్‌. ఆ వివరాల్లోకి వెళితే… గత ఏడాది ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్… తాజాగా నాని కోసం ఓ కథను సిద్ధం చేసాడట. అంతేకాదు… త్వరలోనే నానికి ఈ కథను వినిపించనున్నాడని టాక్.


దీన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. అలాగే… గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను రూపొందించిన వక్కంతం వంశీ కూడా నేచురల్ స్టార్ కోసం ఓ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్టు టాక్. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని సమాచారం. మొత్తం మీద జెర్సీ సినిమా హిట్ అవటంతో ఇండస్ట్రీ లో బిజీ హీరోగా మారిపోయాడు న్యాచురల్ స్టార్ నాని.

 



మరింత సమాచారం తెలుసుకోండి: