ఓ క్రికెట్ జట్టుకి సరిపడేలా టాలీవుడ్ లో మెగా హీరోలున్నారు. ఈమధ్యనే ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్, రాబోతున్న వైష్ణవ్ తేజ్.. నిహారిక కొణిదెలను కలుపుకుంటే మెగా ఫ్యామిలీ మొత్తం 11 మంది ఫుల్ ఫిల్ అయ్యారు. హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం తేలికే కాని స్టార్డం సంపాదించడమే కష్టం.


ఇప్పటికే ఐదారేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ నే ఇంకా మెగా ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోలేదు. ఇక ఈమధ్య వస్తున్న హీరోలది అదే పరిస్థితి.. అల్లు హీరోల విషయమేమో కాని మెగా కాంపౌండ్ అంటే మెగా వారసులు.. మెగా మేనళ్లుల్లు చేసే సినిమాల మీద చిరంజీవి ఎఫెక్ట్ ఉంటుందట. కచ్చితంగా చిరు ఆమోదం పొందాకే ఆ సినిమాలు సెట్స్ మీదకు వెళ్తున్నాయట.


తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగా హీరోలు సినిమా కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెనకాల ఫ్యాన్స్ ఉన్నారు కదా అని అనుకుంటే సాయి ధరం తేజ్ కు వరుసగా 6 సినిమాలు తేడా కొట్టినట్టే ఫలితాలు తిరగబడతాయి. అందుకే ఇప్పుడు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటుగా వరుణ్ తేజ్ కూడా ఏదైనా సినిమా ఓకే చేసే ముందు చిరు సలహా తీసుకుంటున్నారట.


కథను చూచాయగా చిరుతో డిస్కస్ చేశాకనే సినిమాకు ఓకే చెబుతున్నారట. చిరు రిస్క్ అంటే చాలు ఆ ప్రాజెక్ట్ కు మంగళం పాడేస్తున్నారట. సో ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారుతున్న చిరు తన కుటుంబ సభ్యుల కోసం ఆ మాత్రం చేయక తప్పట్లేదు. 150 సినిమాల అనుభవం అన్నిసార్లు కరెక్ట్ డెశిషన్ చెప్పకపోవచ్చు కాని కచ్చితంగా చిరు సపోర్ట్ మెగా హీరోల సినిమాలకు మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పొచ్చు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: