నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ తర్వాత హీరోగా నిలబడ్డ మరో హీరో కళ్యాణ్ రాం. ఒకేసారి 9 సినిమాల ఓపెనింగ్ తో హడావిడి చేసిన తారకరత్న కూడా ఢీ పడ్డాడు. అయితే కళ్యాణ్ రాం కెరియర్ ఒక హిట్టు 3 ఫ్లాపులు అన్న చందానా సాగుతుంది. పటాస్ తర్వాత కొన్ని సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు.


ఈమధ్యనే 118 అంటూ ఓ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. థ్రిల్లర్ జానర్ లో మొదటిసారి సినిమా చేసిన కళ్యాణ్ రాం ఫైనల్ గా సినిమా హిట్ కొట్టాడు. ఇదిలాఉంటే ప్రస్తుతం నీది నాది ఒకే కథ డైరక్టర్ వేణు ఊడుగుల డైరక్షన్ లో తుగ్లక్ సినిమా చేస్తున్న కళ్యాణ్ రాం ఆ సినిమా కూడా వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్నాడట.


ఈ సినిమానే కాదు శతమానం భవతి లాంటి సూపర్ క్లాసిక్ మూవీ తీసిన సతీష్ వేగేశ్న డైరక్షన్ లో కళ్యాణ్ రాం సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఓ పక్క తుగ్లక్ అనిపించుకుంటూనే మరో పక్క ఫ్యామిలీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి నందమూరి వారసుడిగా తన సత్తా చాటి నవ్విన నోళ్లను మూయించేలా కళ్యాణ్ రాం ఇలా సినిమా సినిమాకు సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నాడు.


ఎలాగు నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి కళ్యాణ్ రాం కరెక్ట్ సినిమా పడితే రికార్డులు సృష్టించే సత్తా ఉంది. ప్రస్తుతం తుగ్లక్ ఓ కొలిక్కి రాగానే సతీష్ వేగేశ్న సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందట. శతమానం భవతి హిట్ కొట్టగా నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణ్ మాత్రం నిరాశపరచింది. మరి కళ్యాణ్ రాం సినిమా అయినా హిట్ కొడుతారేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: