“…… కానీ వాటిలో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతులు, విలువల గురించి తెలిపే అంశాలేమీ కనిపించడం లేదు. నేను చెప్పదలచు కున్నది ఏంటంటే….మాకు భారతీయ సినిమా గురించి ఏమీ తెలీదు. అలా తెలీకపోవడంలో మా తప్పేమీ లేదు” ఇదీ మన భారతీయ సినిమాలపై ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జాన్‌ బెయిలీ అభిప్రాయం. 
Image result for president oscar academy
సంవత్సరానికి 1800 పైగా సినిమాలు నిర్మిస్తూ ప్రపంచంలో ఎక్కువ సినిమాలను నిర్మించే దేశంగా ప్రతిష్ట తప్ప మన సంస్కృతి సాంప్రదాయ విలువలను ప్రస్పుటించే సినిమాలే తయారవ్వలేదనటం మనం గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. 
Image result for president oscar academy john bailey and wife Carol
ఒకప్పటి సంగతి ప్రక్కంబెట్టి సమీప గతంలో భారతీయ సినిమా ఎదిగిన తీరు మరచిపోలేనిదే. ప్రపంచ స్థాయిని అందుకుంది. కథ కథనాల పరంగానే కాక సాంకేతికంగా మన సినిమా ప్రమాణాలు ఎంతో పెరిగాయి. హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా భారతీయ  సినిమాలు నిలబడుతున్నాయి.  కానీ ఇంత ఏదిగినా మౌలిక మార్పులెన్నో వచ్చినా ఇంకా ఆస్కార్ అవార్డుల పోటీకి వెళ్లే మన సినిమాలకు అక్కడ గుర్తింపు దక్కట్లేదు. చింతించాల్సిన విషయమేమంటే భారతీయ సినిమాల గురించి తమకు సరైన అవగాహన లేకపోవడం వల్లే అవార్డుకలు ఇవ్వలేక బోతున్నామని ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జాన్‌ బెయిలీ చెప్పడం విశేషం. ఆయన తన సతీమణి కరోల్‌తో కలిసి శనివారం భారత్‌ కు వచ్చారు.
Image result for Indian movies & oscar awards
ముంబయిలో ఆస్కార్స్‌ అకాడమీకి సంబంధించిన ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన, భారతీయ చిత్రాల గురించి తన అభిప్రాయాల్ని బహిరంగంగానేగా చెప్పేశారు.

‘‘నా అభిప్రాయంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పది. ఎందు కంటే భారత్‌ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులకు పెట్టింది పేరు. కానీ మాకు బాలీవుడ్‌ నుంచి విడుదలయ్యే మ్యూజికల్‌ సినిమాల ద్వారా నే భారతీయ చిత్రాల గురించి తెలిసింది. కానీ వాటిలో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతులు, విలువల గురించి తెలిపే అంశాలేమీ కనిపించడంలేదు. నేను చెప్పదలచు కున్నది ఏంటంటే.. మాకు భారతీయ సినిమా గురించి ఏమీ తెలీదు అలా తెలీకపోవడంలో మా తప్పేమీ లేదు” అని అన్నారు. 
Related image
“ఎందుకంటే, ప్రపంచానికి మీ విలువను తెలియజేసేలా సినిమాలను తెరకెక్కించాల్సిన బాధ్యత మీది. ప్రపంచంలో అలాంటి విలువలు ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఉందన్న విషయం మీరు గుర్తించాలి. భారత్‌లో ఆస్కార్స్‌ అకాడమీ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నాం. ఇది నిజంగానే అద్భుతమైన ఐడియా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సినిమాలు విడుదలయ్యేది కేవలం భారత్‌ నుంచే. ఏటా భారత్‌లో 1800 సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అంటే మా హాలీవుడ్‌కు నాలుగు రెట్లు అధికం. ఆస్కార్స్‌ అకాడమీ అంటే కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాదన్న విషయం గుర్తుంచుకోండి’’ అని జాన్ బెయిలీ అన్నారు. 
Image result for president oscar academy john bailey and wife Carol

మరింత సమాచారం తెలుసుకోండి: