నేడు ఎన్టీఆర్ 96వ జయంతి ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే నందమూరి అభిమానులలో ఒక పండుగరోజు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ ఇదేరోజు అత్యంత ఘనంగా జరిగేది. అయితే ఈ ఎన్నికలలో ఘోరపరాజయాన్ని ముందుగానే ఊహించినట్లుగా తెలుగుదేశం అధినాయకత్వం ఈ ఎన్నికల ఫలితాలు రాకముందే మహానాయుడును రద్దుచేసింది.

ఇలాంటి పరిస్థుతులలో ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎటువంటి హడావిడి లేకపోవడం జూనియర్ ఎన్టీఆర్ ను కలిచి వేసింది. సాధారణంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద అలంకరణను హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎటువంటి అలంకరణ లేకపోవడంతో తీవ్ర అసహనానికి లోనైన జూనియర్ సూచనలతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద చివరి నిముషంలో అలంకరణ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈరోజు ఉదయమే జూనియర్ తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి చాలాసేపు భావోద్వేగంగా ఆ ప్రదేశంలో మౌనంగా నుంచున్నాడు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాలలో చాలామంది ఉన్నా ఎవరూ ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద కనిపించక పోవడం హాట్ టాపిక్ గా మారింది. 

దీనికితోడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో చాలామంది ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలగచేసింది. సాధారణంగా ఎన్టీఆర్ జయంతి రోజున పత్రికలు అదేవిధంగా ఛానల్స్ ప్రత్యేక వ్యాసాలు ప్రచురించడం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయడం ఒక సాంప్రదాయంగా ఉండేది. అయితే అటువంటి హడావిడి ఎక్కడా కనిపించకుండా ఈరోజు ఎన్టీఆర్ జయంతి జరుగుతూ ఉండటం నిజమైన నందమూరి అభిమానులకు జీర్ణించుకోలేని వాస్తవంగా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: