బాలయ్య సినిమా నటుడు, జగన్ రాజకీయ నాయకుడు, మరి ఆయనొచ్చి సినిమా అపేయడమేంటి. ఈ ధర్మ సందేహం అందరికీ వస్తుంది. బాలయ్య కొత్త సినిమా నిజానికి ఇప్పటికే స్టార్ట్ అయి ఉండాలి. కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో బాలయ్య హీరోగా సీ కళ్యాణ్ మూవీ తీసుకున్నారు. దీనిని ముహూర్తం కూడా డిసైడ్ అయి వాయిదా పడింది. ఇపుడు టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్.


ఇంతకీ విషయం ఏంటంటే ఈ సినిమా కధ అంతా సీమ ఫ్రాక్షన్ మీద రాసుకున్నారుట. ఇందులో పాత్రలు జగన్ తాత రాజారెడ్డి, జగన్ ని పోలి ఉండేలా  ఫోకస్ చేసి యంగ్, ఓల్డ్ విలన్ క్యారెక్టర్లు  క్రియేట్ చేశారుట. ఆ రెండు పాత్రలను జగపతిబాబు పోషిస్తారని తెలిసింది. ఇక బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ ఫ్రాక్షన్ రాజకీయాలపై ఉక్కుపాదం మోపే విధంగా మూవీ  డిజైన్ చేసారట.


ఇలా అంతా అనుకున్నాక ఏపీలో జగన్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. దాంతో ఈ కధ మొత్తం మార్చాల్సి వస్తోందట. జగన్ని పోలిన  విలన్ గా పెట్టి తీయడం అంటే ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో కుదిరే వ్యవహారం కాదు. దాంతో ముహూర్తం దాకా వచ్చిన ఈ సినిమా ఆగిపోయినట్లుగా టాక్. కొత్త కధ కోసం ఇపుడు చిత్ర యూనిట్ సెర్చ్ చేస్తున్నారుట. మొత్తానికి బాలయ్య మూవీని జగన్ ఆపేశారన్నది నిజమేనంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: