పవన్ కళ్యాణ్ కు ఉన్న లక్కు జూనియర్ ఎన్టీఆర్ కు లేదంటూ టాక్ మొదలయింది టాలీవుడ్ లోను, రాజకీయ పరిశీలకుల్లోను. కారణం పవన్ పరిస్తితి వేరు, ఎన్టీఆర్ పరిస్తితి వేరు కావడమే దీనికి కారణమట. అందుకే ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా విషయంలో ఎన్టీఆర్ తో సహా నిర్మాతకు దిగులు పట్టుకుంది అంటున్నారు.

కారణం పవన్ సోదరుడు చిరంజీవి పై కోపంతో ఆయన సినిమా ‘అత్తారింటికి దారేది’ ని  అడ్డుకుంటారు అనుకున్నారు. అయితే సోదరుడు చిరంజీవి రాజకీయ నచ్చకనే ఆయనతో దూరంగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ అని విపరీతంగా ప్రచారం జరిగింది. పైగా పవన్ కల్యాణ్ డైలాగులు కొన్ని సీమాంద్ర ఉద్యమంలో పాపులర్ అయ్యాయి. ఇలా పవన్ సినిమా సమైక్య, విభజన వాదుల నిరసన నుంచి బయట పడింది అన్న అభిప్రాయాన్ని సినిమా వాళ్లు, రాజకీయులు వ్యక్తం చేస్తున్నారు.

కాని ఎన్టీఆర్ పరిస్థితి అలా కాదు, ఏకంగా ఆయన తండ్రి హరిక్రిష్ణనే పక్కా సమైక్యవాదిగా ప్రకటించుకున్నాడు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాడు, పైగా హరిక్రిష్ణ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎన్టీఆర్ హస్తం ఉందన్న టాక్ కూడా వచ్చింది. అందుకే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు స్పష్టం చేసారు. దీంతో పవన్ కు ఉన్న లక్కు ఎన్టీఆర్ కు లేదేమో అన్నవాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సరే పవన్ సినిమా లాగానే ఎన్టీఆర్ బయటపడాలని మాత్రం సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: