గతంలో చాలా ఫ్లాపులు తర్వాత పటాస్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు కళ్యాణ్ రామ్. అయితే వచ్చిన విజయాన్ని ఏ మాత్రం బ్యాలెన్స్ చేయకుండా ఇష్టానుసారంగా కథల్ని ఎంచుకొంటూ మళ్లీ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు కళ్యాణ్ రామ్. నందమూరి అభిమానులకు మంచి క్రేజ్ ఉన్న కళ్యాణ్ రామ్ ఒకపక్క సినిమాలు నిర్మిస్తూ మరోపక్క హీరోగా రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం తుగ్లక్ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ను బట్టి చూస్తుంటే సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. ఇక సినిమా ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.


అసలు సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో విషయం పక్కన పెడితే సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.తుగ్లక్‌కు వేణు మల్లిడి అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. వరుసగా ఫ్లాప్‌ అవుతున్నా కూడా కథ, దర్శకుడి విషయాల్లో ఈ నందమూరి హీరో అస్సలు జాగ్రత్తలు తీసుకోక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


ప్రేక్షకులను అలరించే డైరెక్టర్లు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు కానీ కళ్యాణ్ రామ్ వాటినేమీ పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా కథల్ని ఎంచుకొంటూ సినిమాలను బ్లాక్ చేస్తూ నందమూరి అభిమానులను నిరాశపరిచిన క్రమంలో కళ్యాణ్ రామ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బ్యాడ్ అని కొంతమంది నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆయన సినిమా హిట్ అవ్వాలని అందరు హీరోలకు ఎలా కోరుకుంటామో అలాగే కోరుకుంటానని..కానీ కళ్యాణ్ రామ్ గారు డైరెక్టర్ ల విషయం లో కథలో ఎంచుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: