కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గజిని సినిమాతో సూర్య తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టాడు. అప్పటినుండి అతని సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే డబ్బింగ్ సినిమాలకు తెలుగులో ఇదవరకు ఉన్నంత క్రేజ్ లేదని చెప్పాలి.


రజినికాంత్, కమల్ హాసన్ సినిమాలే తెలుగులో ఢీలా పడుతున్న సందర్భంలో సూర్య సినిమాలు పెద్దగా బజ్ క్రియేట్ చేయట్లేదు. లేటెస్ట్ గా సూర్య నటించిన ఎన్.జి.కే సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సూర్య తన తెలుగు స్ట్రైట్ సినిమా గురించి ప్రస్థావించాడు.


తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేయాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడట సూర్య. త్రివిక్రం తో స్టోరీ డిస్కషన్స్ కూడా చేస్తున్నాడట. అయితే త్రివిక్రం మార్క్ కథకు సూర్య.. సూర్య కోరుకునే కథను త్రివిక్రం ఇలా ఇద్దరికి మ్యాచ్ అవట్లేదట. ఇద్దరికి ఓకే అనిపించే కథ సెట్ అయితే వెంటనే తెలుగులో సినిమా చేస్తా అంటున్నాడు సూర్య. 


అయినా సరే తన ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది.. ఒక్క లిప్ సింక్ తప్ప మిగతా అంతా తెలుగు సినిమాలానే అన డబ్బింగ్ సినిమాలు ఉంటాయని అన్నారు సూర్య. సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.జి.కే కోలీవుడ్ లో భారీ అంచనాలతో వస్తుంది. మరి తెలుగులో ఈ సినిమా ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: