తెలుగు ఇండస్ట్రీలో ఒక్క చిత్రంతో స్టార్ హీరోగా సంపాదిస్తున్నారు కొత్తగా వస్తున్న హీరోలు.  లక్కుంటే ఏదైనా కలిసి వస్తుందటారు.. అలాగే కంటెంట్ బాగుంటే ఏలాంటి చిత్రాలైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయం తెలిసిందే.  రాంగోపాల్ వర్మ ప్రియ శిష్యుడైన అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయం అయిన కార్తికేయ మంచి విజయం అందుకున్నాడు.   

ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి పది రెట్లు ఎక్కువ వచ్చింది.  బోల్డ్ కంటెంట్ అయినా..సెంటిమెంట్ లవ్ స్టోరీ కావడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.  ఈ చిత్రం తర్వాత కార్తికేయకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి. వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక వైపున 'హిప్పీ' చేస్తూ, మరో వైపున 'గుణ 369' సినిమా చేస్తున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఎర్ర షర్టు వేసుకొని లుంగీ పైకెత్తి కట్టి .. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఈ పోస్టర్ లో కార్తికేయ కనిపిస్తున్నాడు.

ఈ లుక్ లో ఆయన మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు.  తిరుమల రెడ్డి - అనిల్ కడియాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో కార్తికేయ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: