బాహుబలి 2 తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు నటిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏవో ఒక అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి.  ఆ మద్య ఈ చిత్రం గురించి వివరాలు వెల్లడించేందుకు రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన ఓ ఆంగ్ల నటిని తెలుగు లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు తెలిపారు..కానీ అది మద్యలోనే డ్రాప్ ఔట్ అయ్యింది. 

ఆ తర్వాత రాంచరణ్ కి కాలుకి గాయం అయి ఒక నెలరోజులు గ్యాప్ వచ్చింది..ఇంతలోనే ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో అసలు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలు అవుతుందనే సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. తాజాగా #RRR షూటింగ్ మొదలవబోతున్నట్లుగా అందులో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.మొన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ ఫాన్స్ కి చెయ్యి ఊపుతున్నప్పుడు ఎన్టీఆర్ గాయం స్పష్టంగా కెమెరాకి చిక్కింది.

ఇక తాజాగా ఎన్టీఆర్ గాయం ఇంకా మానలేదనడానికి ప్రూఫ్ గా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చిన ఎన్టీఆర్ చేతి గాయం మనలేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ చేతికి ఇంకా కట్టు ఉండడం చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ చేతి గాయం మనలేదనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఎలా షూటింగ్ లో పాల్గొంటారు..ఇద్దరు హీరోలపై షూట్ చేస్తారా..లేదా సింగ్ గా కానిచ్చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: