హీరోయిన్ శ్రియ పోయినేడాది మార్చ్ నెలలో తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.  ఆండ్రీ ఒక బిజినెస్ మ్యాన్ కమ్ టెన్నిస్ ప్లేయర్.   శ్రియా వివాహానికి సంబంధించిన కొన్ని వీడియోలు అప్పట్లోనే బయటకు వచ్చాయి కానీ శ్రియ భర్త ఫోటోలు మాత్రం మీడియాలో రాలేదు. ఉదయపూర్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న టైం లో కొన్ని ఫోటోలు మాత్రమే బయటకి వచ్చాయి ప్రేమ జంటవి. కానీ తాజాగా ఆండ్రీ ఫోటోలు షేర్ చేసి అందరినీ  ఆశ్చర్యపరిచింది.


శ్రియ- ఆండ్రీ జంట ప్రస్తుతం పెరు లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫోటోల ప్రత్యేకహాట ఏంటంటే, మొట్టమొదటి సారి, శ్రీయ తన భర్త ఫోటోలను పబ్లిక్ చెయ్యడమే కాక, తమ ప్రేమను చాలా బోల్డ్ గా వ్యక్తపరుస్తోంది. శ్రీయ తన భర్తని ముద్దు పెట్టె ఫోటోలు, తన భర్త తనని కౌగిట్లో బంధించి ముద్దాడే ఫోటోలు శ్రీయ తన ఇంస్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. 


సినిమాలు లేక ఖాళీ గ ఉన్న ఈ అమ్మడు, మొత్తానికి ఫ్రీ టైం ని బాగా ఎంజాయ్ చేస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ వస్తున్నాయి ఇంస్టాగ్రామ్ లో.'.. ప్రస్తుతం 'సండకారి' అనే  తమిళ్ సినిమా ,హిందీలో 'తడ్కా' అనే మరో సినిమాలో నటిస్తోంది శ్రీయ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: