కత్రినా కైఫ్ అందాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. అభిమానులకు నిద్ర లేకుండా చేసే అందాలు కత్రినా స్వంతం. యాక్టింగ్ రాదు.. మోహంలో ఎక్స్ ప్రెషన్లే పలకవు అనే దశ నుంచి నటనలో డీసెంట్ అనిపించుకునేవరకూ అలుపు లేని పయనం.  ఇక డ్యాన్స్ విషయం కూడా అంతే.. అసలు డ్యాన్స్ రాదు అనే దశ నుండి కమ్లి కమ్లి అని మంట పెట్టేవరకూ కేట్ ప్రయాణం చేసింది.  అయితే ఇవన్నీ కేట్ లో వచ్చిన మార్పులు.. అయితే మొదటి నుంచి ఇప్పటి వరకూ మారకుండా ఉన్న ఒకే విషయం.. కేట్ గ్లామర్.


ఆ విషయంలో తనతో పోటీ పడడం అంత సులువు కాదు.  ఎందుకంటే ఇంటర్నేషనల్ భామ కావడంతో కేట్ ఓ టాల్ బ్యూటీ.  ఇక గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తే అందరూ ఆమె వైపు చూడాల్సిందే. తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది కత్రినా. డిఫరెంట్ డ్రెస్సుల్లో తన అందాన్ని రంగరించి మరీ పోజులిచ్చింది.  వాటిలో కొన్ని ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  పైనున్న ఫోటో అందులో ఒకటి. ఈ ఫోటోకు కత్రినా క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. 


జస్ట్ నక్షత్రాల ఎమోజి మాత్రం పెట్టింది.  బ్లాక్ కలర్ టాప్ వేసుకున్న కత్రినా తన అందాలను ఏమాత్రం పొదుపు పాటించకుండా ఒడుపుగా వడ్డించింది.  వీలైనంత తక్కువ మేకప్ తో అందాల ఆడ అపరిచితురాలి స్టైల్ లో ఉన్న జుట్టుతో.. మైకంగా చూస్తున్న కళ్ళతో ఇన్స్టాగ్రామ్ లో అగ్గి రాజేసింది.ఈ ఫోటోకు నెటిజనుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.  "ఫిలింఫేర్ కు అందాల పండగ".. "చాలామంది వస్తుంటారు పోతుంటారు నువ్వు మాత్రం  హాటెస్ట్ బాలీవుడ్ దివా".."హాట్ నెస్ కు డెఫినిషన్ నువ్వు".. " అందంతో మమ్మల్ని చంపేస్తావా".. "ఆఖో మే నషా హై.. హుస్న్ మే అదా హై.. హమ్ ఆప్ సే ఫిదా హై".. ఇలా సూపర్ కామెంట్లు పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: